ఎన్‌కౌంటర్‌పై కేసీఆర్ వైఖరి ఏమిటో అడిగిన గద్దర్
హైదరాబాద్: మావోయిస్టులు, నక్సలైటు ఉద్యమంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తన వైఖరి ఏమిటో చెప్పాలని ప్రజాకవి గద్దర్ డిమాండ్ చేశారు. ఏపీ పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు ప్రభాకర్ మృతదేహానికి హైదరాబాద్ శివారు యాప్రాల్ లో గద్దర్, విమలక్క తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్‌కౌంటర్ పై తమకు పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులు 28 కి.మీ నడిచి వెళ్లి మావోలను చంపాల్సిన అవసరం ఏమొచ్చిందని గద్దర్ ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడవుల్లోకి వెళ్లి ఎందుకు ఎన్ కౌంటర్లు చేయాల్సి వస్తుందని ప్రశ్నించారు. ఎన్ కౌంటర్స్ చేసుకుంటూపోతే ప్రజలు తిరుగబడుతారని ఆయన హెచ్చరించారు. ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని గద్దర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications