Money: ఎన్నికల నేపథ్యంలో లారీలో రూ.750 కోట్లు.. ఆ డబ్బు ఎవరిది..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భారీగా డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే వందల కోట్లను పోలీసులు పట్టుకున్నారు. మీ వద్ద 50 వేల కంటే ఎక్కువ ఒక్క రూపాయి ఉన్నా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా డబ్బు చేతులు మారుతోంది. తాజాగా ఓ లారీలో నోట్ల గుట్టలను పోలీసులు గుర్తించారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ లారీ తారసపడింది. లారీ ఆపి తనిఖీ చేయగా.. అందులో నోట్ల కట్టలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా రూ.750 కోట్లను పోలీసులు స్వాధీనే చేసుకున్నారు. ఈ డబ్బు కేరళ నుంచి తెలంగాణకు వస్తున్నట్లు గుర్తించారు. నోట్ల కట్టల్లో అన్ని రూ.500 నోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయమై పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఎన్నికల సంఘానికి కూడా సమాచారం అందించారు. పూర్తి విచారణ తర్వాత ఇది బ్యాంకు డబ్బని గుర్తించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన డబ్బు కేరళ నుంచి తెలంగాణలోని బ్యాంకులకు తరలిస్తున్నట్లు తేలింది. అన్ని పత్రాలు సరిగా ఉండడంతో ఎన్నికల సంఘం అధికారి డబ్బను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తరలించాలని ఆదేశించారు.
అక్టోబర్ 17వ తేదీ రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో ఈ 750 కోట్ల రూపాయల డబ్బు లారీ పోలీసుల తనిఖీల్లో పట్టుబడింది. గద్వాల్ లో తనిఖీల తర్వాత.. ఈ డబ్బు లారీని హైదరాబాద్ తరలించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారమే ఈ డబ్బును తరలిస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications