శిరీష-ఎస్సై ఆత్మహత్యలో కీలక ఆధారం మాయం? టీవీ ఎందుకు తీసుకెళ్లారు?
ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసు విచారణలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు స్టేషన్ సీసీటీవీ కెమెరా ఫుటేజి కీలకమవువుతాయని భావించారు.
హైదరాబాద్: ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసు విచారణలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసు స్టేషన్ సీసీటీవీ కెమెరా ఫుటేజి కీలకమవువుతాయని భావించారు. కానీ, స్టేషన్ కెమెరాలు ఈ నెల 3వ తేదీ వరకే రికార్డయి ఉంది.
4వ తేదీ నుంచి ఎస్సై ఆత్మహత్య చేసుకునే వరకు వీడియో ఫుటేజీ హార్డ్ డిస్క్‌లో లేదని తెలిసింది. దీంతో, ఎస్సై ఆత్మహత్యకు ముందు పోలీసు క్వార్టర్స్ దిశగా ఉన్న కెమెరాలో ఏం రికార్డయిందో తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది.

కీలకమైన ఫుటేజీ..
ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఈ నెల 14న తన క్వార్టర్స్‌లో సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బ్యుటీషియన్ శిరీష బలవన్మరణం కేసులో రాజీవ్, శ్రవణ్‌లతో పాటు ఎస్సై ప్రభాకర్ రెడ్డి ప్రమేయముందని తేల్చారు. రెండు కేసులకు సంబంధం ఉన్న నేపథ్యంలో కీలకమైన సిసి కెమెరా కనిపించకుండా పోవడం గమనార్హం. పోలీస్ స్టేషన్ అంతటా సిసిటివి కెమెరాలు ఉన్నాయి. దీంతో స్టేషన్‌కు ఎవరు వచ్చారు, క్వార్టర్స్‌కు ఎవరు వచ్చారో ఇట్టే తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఫుటేజీ లేదు. దీనిని ఎస్సై ప్రభాకర్ రెడ్డే డిలీట్ చేశారా అనే చర్చ కూడా సాగుతోంది.

మొరాయింపు
ఇటు ఎస్సై ప్రభాకర్ రెడ్డి, అటు బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసుల్లో, ఇది కీలక సాక్ష్యం. విచారణలో భాగంగా పోలీసులు తొలుత సీసీటీవీ పుటేజ్ ఉన్న కంప్యూటర్ హార్డ్ డిస్క్ కంటెంట్‌ను చూసే ప్రయత్నం చేయగా మొరాయించింది.

టీవీ ఎందుకు మార్చారు?
దానిని సిద్దిపేట కమిషనరేట్‌కు తరలించారు. సాంకేతిక నిపుణుల సాయంతో దానిని పరిశీలించారు. కానీ అందులో జూన్ 3వ తేదీ వరకే వీడియో రికార్డింగులు ఉంది. మరో ఆసక్తికరం ఏమంటే.. స్టేషన్లో ఉన్న టీవీని ఎస్సై క్వార్టర్‌కు మార్చారు. ఎస్సై క్వార్టర్‌లో టీవీ ఉండగా, దీన్ని ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నే అంటున్నారు.

స్టేషన్లో టీవి లేకుండా ఎస్సై చేశారా?
13వ తేదీ తర్వాతే ఎస్సై స్టేషన్‌లో ఉన్న టీవీని క్వార్టర్‌కు మార్చినట్లు సిబ్బంది చెప్పారని తెలిసింది. శిరీష ఆత్మహత్య కేసుకు సంబంధించి మీడియాలో కథనాలు రావడంతో ఎస్సై ఆందోళనకు గురై స్టేషన్‌లో టీవీ లేకుండా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా ఏ మెమొరీ డివైజ్ నుంచి అయినా డిలీట్ చేసిన డేటాను తిరిగి రాబట్టే అవకాశం ఉంది. పూర్తిగా ఫార్మాట్ చేస్తే మాత్రం కష్టమే. లేదా సిసి కెమెరాలు పని చేయకుంటే అంతే అంటున్నారు.
Recommended Video


మొబైల్ కోసం..
ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు ముందు చివరి ఫోన్‌కాల్ బంజారాహిల్స్ ఎస్సై హరీందర్‌కే చేసినట్లు తొలుత చెప్పారు. కానీ, ఆ తర్వాత ఏసీపీ గిరిధర్ ఫోన్‌కాల్ ఉందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎస్సై తన వ్యక్తిగత నెంబరుతో చేసిన ఫోన్లన్నింటినీ ఆయన రికార్డు చేసుకున్న విషయం తాజాగా తెలిసింది. దాంతో ఆ మొబైల్ ఎక్కడుందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో గజ్వెల్ ఏసీబీపై కేసు నమోదయిన విషయం తెలిసిందే.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications