కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్తీ నెయ్యి తయారీ చేస్తూ, అమాయకుల ఆరోగ్యం తో ఆటలు.అరెస్టు చేసిన పోలీసులు

మెట్‌పల్లి పట్టణం సాయిరాంనగర్‌ కాలనీలో కల్తీ నెయ్యి తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు మహిళలను మెట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

రీంనగర్ :మెట్‌పల్లి పట్టణం సాయిరాంనగర్‌ కాలనీలో కల్తీ నెయ్యి తయారు చేసి ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు మహిళలను మెట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం మెట్‌పల్లి సర్కిల్‌ కార్యాలయంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి విలేకరులకు అరెస్ట్‌ వివరాలను వివరించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కిషంపేట మండలం గరుడవెల్లి గ్రామానికి చెందిన జరుపుల భీమ(30), మెగావత్‌ లక్ష్మి(40), మెగావత్‌ రుక్కు(50)లు డబ్బు సంపాదించేందుకు కల్తీ నెయ్యి తయారుచేసి విక్రయించడాన్ని వృత్తిగా చేపట్టారు. కొంతకాలంగా కల్తీ నెయ్యి తయారు చేస్తూ తక్కువ ధరకు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.

Gang arrested for ghee adulteration at Metpally

గురువారం సాయిరాంనగర్‌ కాలనీలోని ఓ ఇంటిలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారనే సమాచారంతో ఎస్సై అశోక్‌ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ముగ్గరు మహిళలను అదుపులోకి తీసుకొని 50 కిలోల కల్తీ నెయ్యి, అందులో వినియోగిస్తున్న ముడి సరకులను స్వాధీనం చేసుకున్నారు. ఏటా దసరా పండగ ముందు మెట్‌పల్లికి వచ్చి కల్తీ నెయ్యి తయారు చేసి విక్రయస్తున్నారని విచారణలో వెల్లడైంది.

Gang arrested for ghee adulteration at Metpally

కిరాణ షాపుల నుంచి తెచ్చిన డాల్డా, నూనె ప్యాకెట్లను కలిపి వేడి చేసి నెయ్యి వాసన వచ్చేందుకు నెయ్యి మడ్డీని కలిపేవారు. స్వచ్ఛమైన నెయ్యి అంటూ కిలో రూ.300లకే ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు. ప్రజలు తక్కువ ధరకు విక్రయించే పదార్థాలు, వస్తువులు ఎవరూ కొనుగోలు చేయవద్దని సీఐ పేర్కొన్నారు. సమావేశంలో మెట్‌పల్లి, మల్లాపూర్‌ ఎస్సైలు అశోక్‌, సతీష్‌ కుమార్‌లు తదితరులు పాల్గొన్నారు.

English summary
police arrested a gang in Ghee adulteration case at Metpally in Karimnagar district of Telangana state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X