మత్తులోకి దించి...సామూహిక అత్యాచారం చేశారు
హైదరాబాద్ :స్నేహితులని నమ్మింది. వారితో కలిసి బయటకు వెళ్ళింది. నమ్మిన స్నేహితులే ఆమె జీవితాన్ని నాశనం చేశారు. మత్తులోకి దించారు. అ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తు దిగిన తర్వాత ఏం జరిగింది తెలుసుకొని భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంజనిరింగ్ కళాశాల విధ్యార్థినిపై స్నేహితులు సామూహికంగా అత్యచారానికి పాల్పడ్డారు. ప్రిస్టన్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన కొందరు విధ్యార్థులు తమ స్నేహితురాలిని కాలేజ్ బయటకు తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు.

కళాశాలకు సమీపంలోని హుక్కా సెంటర్ కు స్నేహితులంతా వెళ్ళారు. తమతో పాటు ఓ స్నేహితురాలిని కూడ తీసుకువచ్చారు. బలవంతంగా ఆమెకు హుక్కాను తాగించారు.ఆమె క్లాస్ మేట్స్ ఇద్దరు..వారతో పాటు మరో ఇద్దరు జత కలిశారు.
హుక్కా తాగడంతో మత్తులోకి దిగిన ఆమెపై ఆ నలుగురు అత్యాచారం ేశారు. మత్తు దిగిన తర్వాత ఆ విధ్యార్థిని జరిగిన విషయం తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది. విధ్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు విధ్యార్థులను, హుక్కా సెంటర్ నిర్వాహాకుడిని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications