బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం: ఇద్దరు విద్యార్థుల అరెస్ట్
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది. గంజాయి సేవిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని విచారించగా.. గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
విద్యార్థుల నుంచి 35 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ ఇద్దరు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి గంజాయి సరఫరా అయినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా, గంజాయి సేవిస్తూ ఇద్దరు విద్యార్థులు పోలీసులకు పట్టుబడం కాలేజీలో కలకలం రేపింది. తోటి విద్యార్థులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది విద్యార్థులు ఇలా మత్తు పదార్ధాలకు బానిసలుగా మారారోనని కంగారుపడుతున్నారు. కాలేజీలో ఇలాంటి ఘటనలు జరక్కుండా నిఘా పెంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications