ఆయుర్వేద ఔషధమంటూ గంజాయి చాక్లెట్లు అమ్మేస్తున్నారు
నగరంలో గంజాయి చాక్లెట్ల విక్రయాలను వెలుగులోకి తెచ్చిన ఆబ్కారీ అధికారులు దీనిపై దర్యాప్తు జరిపారు. రాజస్థాన్ నుంచి ఈ చాక్లెట్లు సరఫరా అవుతున్నాయని, ఎనిమిది నెలలుగా ఈ దందా సాగుతున్నట్లు తేల్చారు.
నిజామాబాద్: నగరంలో గంజాయి చాక్లెట్ల విక్రయాలను వెలుగులోకి తెచ్చిన ఆబ్కారీ అధికారులు దీనిపై దర్యాప్తు జరిపారు. రాజస్థాన్ నుంచి ఈ చాక్లెట్లు సరఫరా అవుతున్నాయని, ఎనిమిది నెలలుగా ఈ దందా సాగుతున్నట్లు తేల్చారు. గతంలో భంగ్ గోళీలు ఉండేవని, ఇప్పుడు వాటి స్థానంలో గంజాయి చాక్లెట్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ఆకలి, నిద్ర కోసం వినియోగించే ఆయుర్వేద ఔషధమని చెప్పి వీటిని విక్రయిస్తున్నారని చెప్పారు. ఇవి రాజస్థాన్‌లోని ఇండియన్ ప్రొడక్ట్స్ సంస్థ నుంచి నిజామాబాద్‌కు వచ్చినట్లు గుర్తించారు. ఆయుర్వేద ఔషధం ముసుగులో భంగ్, గంజాయి కలిపి చాక్లెట్లు తరహాలో చేసి విక్రయిస్తున్నారని గుర్తించారు.

ఇది ఆయుర్వేద ఔషధమా కాదా అన్నది తేల్చేందుకు అబ్కారీ శాఖ ప్రత్యేక బృందం రాజస్థాన్ వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అబ్కారీ ఉన్నతాధికారులు గురువారం రాజస్థాన్‌లోని ఇండియన్ ప్రొడక్ట్స్ సంస్థకు తాఖీదులు జారీ చేశారు. ప్రయోగశాలకు నమూనాలను పంపారు.












Click it and Unblock the Notifications