వైరల్ : కోరుట్ల వెంకటేశ్వర ఆలయంలో వింత.. స్వామి పాదాల చెంత గరుడ పక్షి (వీడియో)
జగిత్యాల : జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన అనూహ్యమైన ఘటన వైరల్ గా మారింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో వింత చోటుచేసుకుంది. వెంకన్న వాహనమైన గరుడ పక్షి ఆయన పాదాల చెంతకు చేరింది. విషయం కాస్తా అందరికీ తెలియడంతో చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు.

ఆలయ అర్చకులు పూజలు చేస్తున్న సందర్భంలో గుడి గోపురం పైకి చేరింది గరుడ పక్షి. అనంతరం గుడిలోకి ప్రవేశించి అటు ఇటు తిరిగి స్వామివారి పాదాల చెంత అలాగే ఉండిపోయింది. సాక్ష్యాత్తు వెంకన్న వాహనమైన గరుడ పక్షి ఇలా వచ్చిందనే వార్త వైరల్ కావడంతో చూడటానికి భక్తులు క్యూ కడుతున్నారు. ఇదంతా వెంకటేశ్వర స్వామి మహిమగా చెబుతూ ఆనంద పారవశ్యానికి లోనవుతున్నారు.