గ్యాస్ పైప్‌లైన్ పేలుడు: ముగ్గురు సజీవ దహనం
నల్గొండ: జిల్లాలోని సూర్యాపేట మండలం ఇమామ్‌పేటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ పైప్ లైన్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పేలుడు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కాగా, ఒక్కసారిగా గ్యాస్ పైప్ లైన్ పేలడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

గెయిల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్‌లో జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనావాసాలకు సమీపం నుంచే పైప్ లైన్ ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications