తెలంగాణ ఇవ్వడం తప్పయిందా?: జానారెడ్డి ఉద్వేగం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. తెలంగాణ ఇవ్వడం తాము చేసిన పొరపాటేమో అని జానా వ్యాఖ్యానించారు. ఇవి చర్చకు దారి తీసింది.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. తెలంగాణ ఇవ్వడం తాము చేసిన పొరపాటేమో అని జానా వ్యాఖ్యానించారు. ఇవి చర్చకు దారి తీసింది.
తెలంగాణ సిద్ధించిన ముప్పై నెలల తర్వాత మంగళవారం నాడు శాసనసభలో తెలంగాణ అంశం ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. నా తెలంగాణ, నా ఉద్యమం... అంటూ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగంపై జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మన తెలంగాణ అని ఎందుకు అనరని నిలదీశారు. ఈ సందర్భంగా జానారెడ్డి ఉద్వేగానికి గురయ్యారు.
తెలంగాణ ఇవ్వడం పొరపాటేమోనని, మీ తీరు చూస్తుంటే తప్పు చేశామా అనిపిస్తోందని జానా రెడ్డి అన్నారు. తెలంగాణ మీది కాదని.. మనది అన్నారు. ఇచ్చింది మేమని, సాధించికున్నదీ మేమే అన్నారు. మీరు ఉద్యమంలో ముందు ఉన్నారు అంతేనని, అక్కడా, ఇక్కడా అధికారంలో కాంగ్రెస్ పార్టీయే ఉందన్నారు.

ఏపీలో రాజీనామాలు చేస్తుంటే ఏమీ పాలుపోక కేసీఆర్ తన వద్దకు వచ్చారని, ఇక్కడా రాజీనామాలు చేయిస్తానని భరోసా ఇచ్చానని చెప్పారు.
మిషన్ భగీరథ పైన హాట్ హాట్ చర్చ
ప్రభుత్వం మిషన భగీరథ ద్వారా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మిషన్ భగీరథ పథకంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం కాదని, ఆధారాలుంటే చూపాలన్నారు. లేని పక్షంలో పరువు నష్టందావా వేస్తానని కాంగ్రెస్ సభ్యులను ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications