హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

GHMC Exit Polls అంచనా తలకిందులవుతాయా: ప్రారంభ ఫలితాల్లో కమల వికాసం: స్పీడు తగ్గిన కారు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును చేపట్టారు. అవి ముగిసిన వెంటనే మిగిలిన ఓట్లను లెక్కిస్తారు. సాయంత్రానికి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .గెలిచిన అభ్యర్థులు గానీ, వారి అనుచరులు గానీ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విజయోత్సవ ర్యాలీలను నిర్వహించడానికి అనుమతి లేదు.

కల్వకుంట్ల కవిత ధీమా అదే: వందకు పైగా డివిజన్ల మావే: ఆ రెండు పార్టీలకూ పరాభవమేకల్వకుంట్ల కవిత ధీమా అదే: వందకు పైగా డివిజన్ల మావే: ఆ రెండు పార్టీలకూ పరాభవమే

అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ర్యాలీలు, ప్రదర్శనలను నిషేధించారు. ప్రారంభ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడును ప్రదర్శించింది. తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి రెండో స్థానానికి నెట్టేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మెజారిటీ డివిజన్లలో బీజేపీ అభ్యర్థులకు అనూహ్యంగా ఆధిక్యత లభించింది.

GHMC Election Results 2020: Live Updates in Telugu: Early trends shows BJP leads

టీఆర్ఎస్ శాసన సభ్యులు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధుల్లోని డివిజన్లలో బీజేపీ లీడింగ్‌లో రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉదయం 9:30 గంటలకు వరకు అందిన సమాచారం ప్రకారం.. బీజేపీ-50 డివిజన్లలో ఆధిక్యతలో కొనసాగుతోండగా.. టీఆర్ఎస్ 25 చోట్ల పైచేయిని సాధించింది. పరిమితమైంది. ఇదే దూకుడు, ఆధిక్యతను మున్ముందు ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల రేసులో నిలవలేకపోతున్నాయి.

శేరిలింగంపల్లి వంటి కొన్ని చోట్ల రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యత చేతులు మారుతూ వచ్చింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఆంతరం భారీగా ఉండటం వల్ల.. చివరి వరకూ అదే సరళి కొనసాగుతుందని బీజేపీ నేతలు ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎగ్జిట్ పోల్స్్ అంచనాలన్నీ తలకిందులు కావడం ఖాయంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్‌కు 70కి పైగా డివిజన్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రారంభ ఫలితాలు మాత్రం.. ఆ అంచనాలను తలకిందులు చేస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి.

Recommended Video

GHMC Election Results 2020 : ఇదివరకటి కంటే అధిక డివిజన్లను గెలుచుకుంటాం! - MLC Kalvakuntla Kavitha

English summary
Hyderabad GHMC Election Results 2020 Live Updates in Telugu: Early trends show that Bharatiya Janata Party leads. BJP leads in 50 divisions and TRS limits as 25.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X