గ్రేటర్ వి'చిత్రం': థియేటర్లు పుల్లు... పోలింగ్ కేంద్రాలు డల్లు

హైదరాబాద్: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికల్లో మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు 50 వేల మంది ఉద్యోగులు ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు.

థియేటర్లు పుల్లు... పోలింగ్ కేంద్రాలు డల్లు:

జూబ్లీ క్లబ్‌లో నటుడు రామ్ చరణ్ తేజ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గాను హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సెలవును ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు కాకుండా మరోలా వినియోగించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని పలు థియేటర్లు పుల్లుగా ఉండగా, పోలింగ్ కేంద్రాలు మాత్రం ఓటర్లు లేక డల్లుగా ఉన్నాయి.

జిహెచ్ఎంసి ఎన్నికల్లో బంజారాహిల్స్ నుంచి పోటీ చేస్తున్న తెరాస పార్లమెంటు సభ్యుడు కె. కేశవ రావుకూతురు విజయలక్ష్మి మంగళవారం ఎన్‌బీటి నగర్‌లో ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓటరు కార్డులున్నా అడ్డుకున్నారని నిరసన వ్యక్తం చేశారు.

డబ్బులు పంపిణీ చేస్తున్నారనే అభియోగాలతో మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కూతురు శిల్పారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గౌన్‌ఫౌండ్రీ ప్రాంతంలో కార్యకర్తలకు శిల్పారెడ్డి డబ్బులు పంచుతుండగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

చార్మినార్ ఎమ్మెల్యే పాషాఖాద్రి, పురానాపూల్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి గౌస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై దాడి చేశారని కాంగ్రెస్ అభ్యర్థి ఫిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, సినీ హీరో అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో ఓటేశారు. జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో తన ఓటు హక్కును వినయోగించుకున్నారు.

ఖైరతాబాద్ పోలింగ్ బూత్‌లో గవర్నర్ నరసింహన్ దంపతులు ఓటేశారు. జూబ్లీహిల్స్‌లో సినీ నటుడు నాగార్జున, ఆయన భార్య అమల ఓటేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటేయాలని నాగార్జున పిలుపునిచ్చారు. ఓటేసినవారికే ప్రశ్నించే హక్కు ఉంటుందని గవర్నర్ అన్నారు.

GHMC elections: polling begins in Greater Hyderabad

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి, ఆయన కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి జూబ్లీహిల్స్ లో ఓటేశారు. తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి రిసాలాగడ్డలో ఓటేశారు. కుందన్ బాగ్ లో హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి కుందన్ బాగ్ లో ఓటేశారు.

GHMC elections: polling begins in Greater Hyderabad

పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలూ తీసుకున్నట్లు మహేందర్ రెడ్డి చెప్పారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసుకోవాలని ఆయన అన్నారు.

కాబోయే మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు బంజారాహిల్స్ లోని నూర్ నగర్ లో ఓటు వేయగా, ఆయన భార్య శైలిమ హిమాయత్ నగర్ లో ఓటేశారు. బిజెపి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగుదేశం హిందూపురం శాసనసభ్యుడు బంజారా హిల్స్ లో ఓటేశారు.

పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు: పోలింగ్ ఆలస్యం

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గడిచిన రెండు రోజులుగా సూర్యుడి ప్రతాపం పెరిగిపోవడంతో అధికారులు ముందస్తుగా టెంట్ల ఏర్పాటుతో పాటు మంచినీళ్ల సౌకర్యం కల్పించారు.

కాగా ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యమవుతోంది. కొండాపూర్ 33, 34, 35వ బూత్‌లలో అదేవిధంగా కేబీహెచ్‌బీ కాలనీ 5,6,7,8,9,10 బూత్‌ల్లో, హయత్‌నగర్ సిద్ధార్థ స్కూల్లో, వనస్థలిపురం రోడ్ నెం. 9లో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నారు.

GHMC elections: polling begins in Greater Hyderabad

కేటీఆర్‌కు అందని పోలింగ్ స్లిప్

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్నీ తానై ప్రచారం చేసిన తెలంగాణ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌కు జీహెచ్ఎంసీ సిబ్బంది పోలింగ్ స్లిప్‌ను అందించలేదని తెలుస్తోంది. కేటీఆర్ బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 14లో ఉన్న నందీనగర్ లో నివసిస్తుండగా, అక్కడే ఆయనకు ఓటుంది.

సోమవారం సాయంత్రం వరకూ ఆయనకు పోలింగ్ స్లిప్ ఇవ్వలేదని సమాచారం. కుందన్‌బాగ్‌లో హైదరాబాద్ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఓటేశారు. ఈసారి ఓటింగ్ ఎక్కువగా జరుగుతుందని జనార్దన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ఎలక్షన్ కమిషర్ నాగిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఓటేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 150 డివిజన్లకు పోలింగ్ జరుగుతోంది. వాకింగ్‌ చేస్తున్నవాళ్లు, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేస్తున్నవారు ఉదయమే ఓటేయడానికి వచ్చారు.

బంజారాహిల్స్ పోలింగ్ బూత్ 7లో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు ఓటేశారు. బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాంనగర్ లో ఓటేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+