అల్లు అరవింద్‌కు షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం... అక్రమ నిర్మాణమంటూ
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఒక భవనంపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఉన్న అల్లు అరవింద్ బిజినెస్ పార్క్‌లో అనుమతి లేకుండా అదనపు నిర్మాణం చేపట్టినందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
వెయ్యి గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు నాలుగు అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. అయితే, తాజాగా నాలుగవ అంతస్తు పైన ఎటువంటి అనుమతులు లేకుండా పెంట్‌హౌస్‌ను నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ అధికారులు దృష్టి సారించి, అది భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధమని నిర్ధారించారు.

ఈ అక్రమ నిర్మాణంపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసులను పంపింది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే ఇలాంటి అక్రమాలకు పాల్పడటం తీవ్రమైన విషయమని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భవనం వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించబడుతోంది. అల్లు అరవింద్ ఇచ్చే వివరణ ఆధారంగా జీహెచ్‌ఎంసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అరవింద్ నుంచి సమాధానం వచ్చిన తర్వాతే పెంట్‌హౌస్ భవితవ్యంపై నిర్ణయం వెలువడనుంది.












Click it and Unblock the Notifications