GHMC లో కొత్త వార్డులు ఖరార్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డుల సంఖ్యపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వార్డుల సంఖ్యను 300గా ఖరారు చేసింది. ఈ మేరకు జీఓ జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధి భారీగా పెరిగినట్టయింది. శివారర్లలోని మొత్తం 27 మున్సిపాలిటీలను విలీనం చేసిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుత వార్డుల సంఖ్యను తిరిగి ఖరారు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ను ఇదివరకే జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రభుత్వానికి అందజేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 300 వార్డులను నోటిఫై చేయాల్సిందిగా కోరారు. ఈ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం వార్డుల సంఖ్యను 300గా ఖరారు చేసింది. 1955 నాటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 5తో కలిపి సెక్షన్ 8(1) కింద జీఓ జారీ అయింది.

ఈ ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జారీ చేశారు. శివార్లలోని మున్సిపాలిటీల విలీనం అనంతరం దీని పరిధి 2,000 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తుంది. ఫలితంగా ఆయా ప్రాంతాలు కూడా కోర్ సిటీతో సమానంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పదవీకాలం ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది. ఈలోగా విలీన ప్రక్రియ పూర్తవుతుంది. దీని తర్వాతే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
విలీనం కానున్న మున్సిపాలిటీలు ఇవే..
1. పెద్ద అంబర్‌పేట్
2. జల్‌పల్లి
3. శంషాబాద్
4. తుర్కయంజాల్
5. మణికొండ
6. నార్సింగి
7. ఆదిభట్ల
8. మేడ్చల్
9. నాగారం
10. దమ్మాయిగూడ
11. పోచారం
12. ఘట్‌కేసర్
13. గుండ్ల పోచంపల్లి
14. తూంకుంట
15. తుక్కుగూడ
16. కొంపల్లి
17. దుండిగల్
18. బొల్లారం
19. తెల్లాపూర్
20. అమీన్‌పూర్
21. బడంగ్‌పేట్
22. బండ్లగూడ జాగీర్
23. మీర్‌పేట
24. బోడుప్పల్
25. నిజాంపేట్
26. ఫిర్జాదిగూడ
27. జవహర్‌నగర్












Click it and Unblock the Notifications