జీహెచ్ఎంసీ నయా రికార్డ్.. 2 వేల కోట్లు కలెక్షన్స్..!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డు సృష్టించింది. నగర పరిధిలో పన్ను వసూళ్లు ఈ రోజు రూ. 2 వేల కోట్ల మార్కును అధిగమించినట్టు ప్రకటించింది. ఒక ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,012.36 కోట్లు దాటడం జీహెచ్ఎంసీ చరిత్రలో ఇదే మొదటిసారి. గత ఏడాది కంటే ఈసారి అధికంగా.. అద్భుతమైన వసూళ్లను సాధించామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్ రోస్ పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది రూ. 257 కోట్లకు పైగా ఆస్తిపన్ను అదనంగా వసూలైందని స్పష్టం చేశారు. 2023-2024 సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాల మేరకు రూ.1,810 కోట్లు కాగా.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 2,012.36 కోట్లుపైగానే వసూలైందన్నారు. ఆస్తి పన్ను బకాయిలపై వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటిఎస్) పథకం అమలు ద్వారా ఆస్తి పన్ను పై 90 శాతం వడ్డీ మాఫీని ప్రారంభించడంతో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడంతో ఈ ఏడాది దాదాపు రూ.300 కోట్ల పన్నులు వసూలు అయ్యాయని తెలిపారు. చివరి రోజు రూ. 123 కోట్ల రూపాయల పన్ను వసూళ్లు నమోదు అయిందని తెలిపారు.

బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్‌స్పెక్టర్లు పలువురు బిఎల్‌ఓలు, బిఎల్‌ఓ సూపర్‌వైజర్ల వంటి కీలకమైన ఎన్నికల విధులు నిర్వహిస్తున్నప్పటికీ లక్ష్యాన్ని అధిగమించామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిల వసూళ్లు సమిష్టి కృషితో సులభతరమైందని అన్నారు. ఈ సమిష్టి కృషితో జిహెచ్‌ఎంసి ఆస్తిపన్ను వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించిందని కమిషనర్ తెలిపారు.












Click it and Unblock the Notifications