ప్రియుడ్ని చంపేసి సంచీలో చుట్టేశారు: తప్పించుకున్న ప్రేయసి
కరీంనగర్: తమ అమ్మాయిని ప్రేమించాడనే కోపంతో ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఇంట్లోకి పిలిచి మరీ ప్రియురాలి కుటుంబసభ్యులు చితకబాది చంపి గోనె సంచిలో చుట్టేశారు. కరీంనగర్ జిల్లాలోని యైటింక్లయిన్ కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - కేకేనగర్‌కు చెందిన కనుకుంట్ల సదానందం (25), సీఆర్‌క్లబ్ సమీపంలోని టీ10-470 క్వార్టర్‌లో ఉండే యువతి (18) బంధువులు. ఇద్దరూ ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. యువతి ఇంటికొచ్చి సదానందం ఆమెతో మాట్లాడుతుండగా, ఆమె తల్లి లింగమ్మ, సోదరుడు సతీశ్ టీ1-470 క్వార్టర్‌లోకి లాక్కెళ్లారు.

వీరిద్దరితో పాటు యువతి తండ్రి పులిపాక నర్సయ్య, సోదరుడి స్నేహితుడు కటికె శేఖర్ కలిసి సదానందంను కొట్టి చంపి, గోనెసంచిలో చుట్టి మంచం కింద దాచారు. యువతిని కూడా చంపేందుకు ప్రయత్నించగా తప్పించుకుని బయటకొచ్చి 100 నంబర్‌కు కాల్ చేసి పోలీసులకు చెప్పింది.
దీంతో యైటింక్లయిన్‌కాలనీ పోలీసులు హుటాహుటిన రావడంతో ఆమె కుటుంబీకులు పరారయ్యారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సదానందం తల్లిదండ్రులు ఐలమ్మ, బానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications