వారం రోజుల పాటు బాలికపై సామూహిక అత్యాచారం, ప్రజా ప్రతినిధి భర్త కూడ ....
ఓ బాలికను నమ్మించి మోసం చేసింది ఓ వివాహిత,క్షుద్రపూజలు చేస్తామంటూ బాలికను ముగ్గురు వ్యక్తులు వారం రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరో దఫా ఓ ప్రజా ప్రతినిధి భర్త సహ మరికొందరు బాధితురాలిపై
నార్కట్ పల్లి:అభం కుభం తెలియని బాలికకు మాయమాటలు చెప్పి ఓ బాలికను ఓ మహిళ మృగాళ్ళకు అప్పగించింది.వారం రోజుల పాటు బాలికపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు.ఓ ప్రజాప్రతినిధి భర్త కూడ బాలికపై అత్యాచారం చేశాడు.
బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకొంది.
నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండంలోని అక్కెనపల్లి గ్రామానికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన కళమ్మ రెడ్డి అనే మహిళ క్షుద్రపూజల్లో పాల్గొనాల్సిందిగా ఒప్పించింది.

ఈ ఏడాది జనవరి 29వ, తేది నుండి ఇంటి నుండి బాలికను కళమ్మ రెడ్డి తీసుకెళ్ళింది.మోత్కూరు మండలంలోని అనాజిపురంలో నిజామాబాద్ కు చెందిన మట్టి వినోద్ కుమార్, రాజు, వినోద్ లకు బాలికను అప్పగించింది.
అయితే వాళ్ళు ఈ బాలికను అద్దె గదిలోకి తీసుకెళ్ళి పూజలు చేయలంటూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఒప్పుకోకపోవడంతో మద్యం తాగించి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
వారం రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం పూజలు పూర్తయ్యాయని బాలికను ఇంటికి పంపారు.అయితే ఈ నెల 13వ, తేదిన కళమ్మ రెడ్డి మళ్ళీ బాలికను మభ్యపెట్టింది.
ఇప్పుడు వెళ్తే డబ్బులు వస్తాయంటూ తీసుకెళ్ళింది. నెమ్మాని గ్రామానికి చెందిన అలుగుబెల్లి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఉంచింది. నెమ్మాని ఎంపిటీసి సభ్యురాలి భర్త ఉయ్యా వెంకన్నతో పాటు మరికొందరు వ్యక్తంులు బాలికపై ఈ నెల 15వ, తేది వరకు అత్యాచారానికి పాల్పడ్డారు.అనంతరం ఇంటికి పంపించారు.
ఎక్కడి తిరుగుతున్నావంటూ బాలిక తాత బాలికపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాధితురాలు అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో తండ్రి సైదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications