యువతిపై గ్యాంగ్‌రేప్, చిత్రీకరణ: మూడో నిందితుడి అరెస్ట్, ఇద్దరిపై మహిళల దాడి
కరీంనగర్: జిల్లాలోని వీణవంకలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం మూడో నిందితుడిని అరెస్టు చేశారు. ఏ-1 నిందితుడు శ్రీనివాస్(22), ఏ-2 అంజయ్య(17)ను నిన్న అరెస్టు చేసిన హుజూరాబాద్ పోలీసులు ఆదివారం ఉదయం ఏ-3 నిందితుడు రాకేశ్(17)ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడి, ఆ ఘటనను సెల్‌లో చిత్రీకరించి లైంగిక వేధింపులకు గురిచేశారని తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 24 బాధితురాలి బంధువుల దాడిలో గాయపడిన శ్రీనివాస్, అంజయ్యలను వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. ఇద్దరినీ ఆదివారం ఉదయం డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితులైన ఇద్దరిపై మహిళాసంఘాల ప్రతినిధులు శనివారం రాత్రి వరంగల్‌లోని ఆస్పత్రిలోనే దాడిచేశారు.












Click it and Unblock the Notifications