తప్పనిసరి పరిస్థితుల్లోనే సచివాలయానికి వెళ్లా: బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలను పక్కనపెట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే రాష్ట్ర సచివాలయంలో అడుగుపెట్టినట్లు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాలు బాగా నష్టపోయాయని తెలిపారు. అన్ని అంశాలు కేంద్రం దృష్టిలో ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం నివేదిక అందిందని చెప్పారు.
నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారం తెలంగాణ, ఏపీకి కేంద్రం సహాయం చేస్తుందని బండి సంజయ్ తెలిపారు. సచివాలయంలో వరదలపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం రేవంత్ రెడ్డి, ఇతరమంత్రులతో కలిసి సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం హోటల్ హరిత ప్లాజాలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు బండి సంజయ్.

ఇది రాజకీయాలతో కూడిన సమస్య కాదని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులు రూ. 1,345 కోట్లు ఉన్నాయని, ఈ నిధులను గత ప్రభుత్వం వాడుకోలేకపోయిందని అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ, తెలంగాణను ఆదుకుంటామని చెప్పారని తెలిపారు. ప్రధానితో చర్చించి సాయం అందించనున్నట్లు చెప్పారు. కేంద్ర బృందం కూడా తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్.
Met Hon’ble Telangana Chief Minister Shri @revanth_anumula garu and Hon’ble Deputy Chief Minister Shri @Bhatti_Mallu garu at Dr B.R Ambedkar Telangana Secretariat along with Hon’ble Union Minister Shri @ChouhanShivraj ji to take a stock of the recent floods and the relief… pic.twitter.com/SHXUM3fapw
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 6, 2024
ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి, రాజకీయాలు పక్కనపెట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే సచివాలయానికి వెళ్లానని బండి సంజయ్ తెలిపారు. సెక్రటేరియట్‌లో మూడంతస్తుల్లో డోమ్‌లే ఉన్నాయని.. తాము అధికారంలోకి వస్తే వాటిని కూల్చేసి మార్పులు చేస్తామని చెప్పారు. కాగా, గతంలో వరదలు వచ్చినప్పుడు ఎప్పుడూ గత ప్రభుత్వం కేంద్రమంత్రుల్ని పిలవలేదని, కలవలేదని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. కేసీఆర్ దశమ గ్రహమని.. ఆయన నవగ్రహ యాగాలు కాదు.. దశ గ్రహ యాగాలని వ్యంగ్యాస్త్రాల సంధించారు.












Click it and Unblock the Notifications