దొంగ కడుపులోంచి బంగారు తాళి బయటపడింది, సహజ పద్ధతిలోనే
హైదరాబాద్: సికింద్రాబాదులో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన స్నాచర్ వికాస్ పొట్టలో నుంచి సహజ పద్ధతుల్లో బంగారం మంగళసూత్రం బయటపడింది. అతని కడుపులో ఉన్న బంగారు గొలుసును ఆపరేషన్ ద్వారా తీద్దామని తొలుత భావించినా, సహజ పద్ధతిలోనే బయటకు తీశారు.

వికాస్ మూడు రోజులుగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ రోజు సహజ పద్ధతిలో నాలుగు తులాల బంగారు గొలుసు బయటకు వచ్చింది.
మూడు రోజుల క్రితం చైన్ స్నాచర్ వికాస్ సికింద్రాబాదులో వాకింగ్ చేస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసును దొంగిలించాడు. అది నాలుగు తులాలు ఉంది. ఆమె అరిచింది. దీంతో అతను పరుగెత్తాడు. పోలీసులు గుర్తించి అతనిని పట్టుకున్నారు.

అయితే, పోలీసులు తనను పట్టుకోవడానికి వచ్చే ముందే అతను ఆ బంగారు మంగళ సూత్రాన్ని మింగేశాడు. తద్వారా పోలీసులకు పట్టుబడకుండా ప్రయత్నాలు చేశాడు. పోలీసులు అతనిని ఆసుపత్రికి తీసుకు వెళ్లి స్కానింగ్ చేయించారు. అతని కడుపులో బంగారు చైన్ ఉన్నట్లు గుర్తించి, చికిత్స కోసం గాంధీలో చేర్పించారు. మూడు రోజుల తర్వాత అది సహజపద్ధతిలో బయటపడింది.












Click it and Unblock the Notifications