హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం.. మంచి రోజులొచ్చాయ్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు GOOD NEWS. మెట్రో రైళ్లు నడిచే సమయాన్ని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది మెట్రో బోర్డు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11.45 గంటల వరకు మెట్రోరైళ్లు నడపనున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వెసులుబాటును ప్రయాణికులు వినియోగించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే మెట్రోరైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే.

అంతేకాక ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న ఆఫర్ ను మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. విద్యార్థులు 20 ట్రిప్పుల డబ్బులతో 30 ట్రిప్పులు వెళ్లే ఆఫర్ పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 31తో ముగియనున్న సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసకున్నట్లు వివరించారు.
మరోవైపు మెట్రో ప్రయాణికుల కోసం సరికొత్త టి-సవారీ యాప్ ను తీసుకొచ్చినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications