వాహనదారులకు గుడ్ న్యూస్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్ కు గడువు పొడిగింపు
ట్రాఫిక్ చలాన్ ల సేకరణ విషయంలో వినూత్నంగా ఆలోచించిన ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ పెట్టిన వారి కోసం పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు చలాన్లలో 75 శాతం డిస్కౌంట్, ఫోర్ వీలర్ వాహనాలకు చలాన్లు 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ డిస్కౌంట్ లో చలాన్లు చెల్లించడానికి నెల రోజుల గడువు పెట్టిన క్రమంలో వాహనదారుల నుండి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు మరో 15 రోజులగడువు పెంపు
ఈ క్రమంలో పెండింగ్ ట్రాఫిక్ ఈ చలాన్ ల పై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రాయితీని మార్చి 31తో ముగియనున్నప్పటికీ వాహనదారుల నుండి వచ్చిన రెస్పాన్స్ చూసిన ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్ ల రాయితీ గడువును మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని వెల్లడించింది. ఈమేరకు హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు ఈ చలాన్ ల పై డిస్కౌంట్ వర్తిస్తుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించినా, మరోమారు పదిహేను రోజులపాటు ఈ అవకాశాన్ని తొలగించడంతో పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ఒక్కసారిగా ఈ చలాన్ సైట్ కి పెరిగిన ట్రాఫిక్ .. సర్వర్ సమస్య .. అందుకే పొడిగింపు నిర్ణయం
పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల గడువు ముగుస్తుందని పెండింగ్ చలాన్లు కట్టేందుకు ఎక్కువమంది వాహనదారులు ఈ చలాన్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయడంతో సర్వర్ పై విపరీతమైన ఒత్తిడి పడింది. దీంతో సర్వర్ సమస్య తలెత్తింది. సర్వర్ సమస్యతో చాలా మంది ట్రాఫిక్ చలాన్లను చెల్లించటానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే మరోమారు పెండింగ్ చలాన్లు క్లియరెన్స్ కోసం పదిహేను రోజుల పాటు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకు 250 కోట్ల రూపాయల ఫైన్లు వసూలు
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 .40 కోట్ల పెండింగ్ చలాన్లు చెల్లింపులు జరిగాయని మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. చలాన్ల ద్వారా ఇప్పటివరకు 250 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని హోం మంత్రి వెల్లడించారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న కారణంగా, గడువును పొడిగించాలని ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 15వ తేదీ వరకు పెండింగ్ చలాన్ లపై రాయితీ అవకాశాన్ని పొడిగించినట్లు పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో పెండింగ్ చలాన్లు చెల్లించాలన్న హోమంత్రి
ఇప్పటివరకు పెండింగ్ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఆన్లైన్లో పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని హోంమంత్రి సూచించారు. మొత్తానికి ట్రాఫిక్ చలాన్ ల క్లియరెన్స్ కోసం పోలీసులు చేస్తున్న వినూత్న ప్రయోగం సత్ఫలితాలను ఇస్తుంది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న చలాన్లు చెల్లించకుండా ఉన్నవారు ప్రభుత్వం డిస్కౌంట్ ఇవ్వడంతో పెండింగ్ చలాన్లు చెల్లించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి మంచి ఆదాయం లభిస్తుంది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications