ప్రయాణికులకు శుభవార్త..మెట్రోలో అడ్వాన్స్‌డ్ టికెటింగ్ విధానం..
హైదరాబాద్ వంటి మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు మెట్రో వంటి ప్రయాణాలను అందుబాటులోకి తెచ్చారు. వీటి వల్ల చాలామంది ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు సకాలంలో వారి గమ్యస్థానాలకు చేరుకోగలుగుతున్నారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్ అండ్ టీ ఓ శుభవార్తను మోసుకొచ్చింది. త్వరలోనే మెట్రోలో అడ్వాన్స్‌డ్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. విదేశాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చేందుకు ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ కంపెనీ సిద్ధమవుతోంది.
సాధారణంగా ఏ ట్రైన్ ఎక్కినా ముందుగానే టిక్కెట్ తీసుకుంటాం. కానీ, ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్‌లో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నాక టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పడు ఇదే పద్ధతిని మెట్రో అవలంభించేందుకు సిద్ధమవుతోంది. మెట్రో ప్రయాణికులు ట్రైన్ ఎక్కే ముందు టికెట్ కొనాల్సిన పనిలేదు. దిగిన తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా చాలామంది ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.

ఇప్పటికే టిక్కెట్లు, చెల్లింపు పద్ధతిలో చాలామార్పులనే మనం చూస్తున్నాం. వెండింగ్ మెషీన్ల ద్వారా టిక్కెట్లు పొందడం, స్మార్ట్ కార్డ్‌లు, మొబైల్‌ల నుంచి వాట్సాప్‌లో టిక్కెట్ బుకింగ్.. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్‌ల ద్వారా అనుమతించడం వంటివి ఇప్పటివరకు చాలానే చూశాం. ఇక, ఇప్పడు ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్‌ను కూడా త్వరలోనే చూడబోతున్నాం.
ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టాలని మెట్రో రైల్ భావిస్తోంది. ఈ పద్ధతి ద్వారా ప్రయాణికులు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని పొందొచ్చు. ఈ పద్ధతి ద్వారా త్వరగా గమ్యస్థానానికి వెళ్లాల్సిన వారు క్యూ లైన్లో వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు.












Click it and Unblock the Notifications