RRB అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. పరీక్షలకు 42 స్పెష‌ల్ ట్రైన్స్‌..

ఆర్ఆర్‌బి అభ్య‌ర్థుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఓ శుభ‌వార్త‌ను అందించింది. న‌వంబ‌ర్ 25 నుంచి జరగనున్న రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం స్పెష‌ల్ ట్రైన్స్ అందుబాటులోకి తీసుకరానున్న‌ట్లు తెలిపింది. ఈ ట్రైన్స్ వేర్వేరు ప్రాంతాల నుంచి న‌డ‌వ‌నున్నాయి. ఈ ప‌రీక్ష‌ల కోసం మొత్తం 42 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఆర్ఆర్‌బి ఏఎల్‌పి ప‌రీక్ష‌లు ఈ నెల 25 నుంచి జరగనున్న సంగ‌తి తెలిసిందే. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం రెండు తెలుగురాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల నుంచి మొత్తం 42 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న‌ను కూడా విడుద‌ల చేశారు. న‌వంబ‌ర్ 24, 25, 26, 28, 29వ తేదీల్లో గుంటూరు టు సికింద్రాబాద్ (07101), ఈ నెల 24, 25, 26, 28 తేదీల్లో సికింద్రాబాద్ టు గుంటూరు(07102), కరీంనగర్ టు కాచిగూడ (07103), కాచిగూడ టు కరీంనగర్‌ (07104), నవంబ‌ర్ 23వ తేదిన నాందేడ్ టు తిరుపతి (07105) కి స్పెష‌ల్ ట్రైన్స్‌ను అభ్య‌ర్థుల కోసం అందుబాటులోకి ఉంచిన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Good news for RRB candidates 42 special trains for exams

స్పెష‌ల్ ట్రైన్స్‌..

వీటితోపాటు ఈ నెల (న‌వంబ‌ర్‌) 24వ తేదిన తిరుపతి టు నాందేడ్‌ (07106), 24, 26, 28, 29 తేదీల్లో కాకినాడ టౌన్ టు తిరుపతి (07107), తిరుపతి టు కాకినాడ టౌన్‌ (07108) న‌వంబ‌ర్ 24, 25, 26 తేదీల్లో కాచిగూడ టు కర్నూల్‌ సిటీ (07109), కర్నూల్‌ సిటీ టు కాచిగూడ (07110), 24, 25, 26, 27 తేదీల్లో హుబ్లీ టు కర్నూల్‌ సిటీ (07315), అలాగే.. ఈ నెల 25, 26, 27, 28 తేదీల్లో కర్నూల్‌ సిటీ టు హుబ్లీ (07316) కి స్పెష‌ల్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు. అభ్య‌ర్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+