విద్యార్ధులకు తీపికబురు.. తెలంగాణలో 'దోస్త్' నోటిఫికేషన్ రిలీజ్ !
తెలంగాణలో డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల (DOST) 2025-26 నోటిఫికేషన్‌ను విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన కలిసి రిలీజ్ చేశారు. ఈ ప్రక్రియతో లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యలో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,67,456 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే బాలకృష్ణ రెడ్డి తెలిపిన ప్రకారం.. ఈ సంవత్సరం మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు జరుగనున్నాయని తెలుస్తోంది. మొదటి విడత దరఖాస్తుల కోసం మే 3 నుండి 21 వరకు అవకాశం ఉంటుంది. మే 10 నుండి 22 వరకు విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను వెబ్ ఆప్షన్ల రూపంలో ఎంచుకోవచ్చు. ఆ తర్వాత సీట్ల కేటాయింపు మే 29న ప్రకటించబడుతుంది. చివరగా తరగతులు జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,057 డిగ్రీ కళాశాలలు ఉండగా, వాటిలో 987 కళాశాలలు దోస్త్ పరిధిలోకి వస్తున్నాయి. మిగిలిన 70 కళాశాలలు ఈ ప్రక్రియలో పాల్గొనడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి బకెట్ సిస్టమ్ ప్రవేశాలలో అమల్లోకి రానుంది. అలాగే ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్ నిబంధనలు అనుసరించి సీట్లు కేటాయించబడతాయి. పూర్తి వివరాల కోసం https://dost.cgg.gov.in/ అధికారిక వెబ్ సైట్ ను చూడొచ్చు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications