రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ GOOD NEWS..

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం.. ఉగాది రోజున సన్నబియ్యం పథకం ప్రారంభించనున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. రేషన్ కార్డుదారు దారులకు రేషన్ షాపుల్లో బియ్యంతోపాటు నిత్యావసర సరుకులు కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్నబియ్యం అందజేయనున్నట్లు ఈ మేరకు వివరించారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.

Good News for Telangana Civil Supplies Minister Announces Fine Rice Scheme for Ugadi

అయితే సన్నబియ్యంతో పాటు ఇచ్చే నిత్యావసర సరుకుల్లో ఏమేమి ఇస్తారో మాత్రం గోప్యంగా ఉంచారు. గతంలో నిత్యావసర సరుకుల కింద పంచదార, పప్పు, ఉప్పు, నూనె, గోధుమ పిండి, కిరోసిన్ ఇచ్చేవారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా రేవంత్ సర్కార్ ఏమి ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 91,19,268 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో లబ్ధిదారులు 2,82,77,859 మంది ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న సన్న బియ్యం నిల్వలు నాలుగు నెలల వరకు సరిపోనున్నట్లు సమాచారం.

మరోవైపు SLBCలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని.. ఇప్పటివరకు రెండు మృతదేహాలను బయటకు తీశామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. మిగిలిన మృతదేహాలను కూడా త్వరలోనే వెలికి తీసి SLBC నిర్మాణాన్ని పూర్తిచేసితీరుతామని స్పష్టం చేశారు. ఇక త్వరలోనే తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+