టిఎస్‌ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. ఇకపై సిటి బ‌స్సులో క్యాష్‌లెస్ ప్ర‌యాణం..

ప్ర‌యాణికుల‌కు తెలంగాణ ఆర్‌టిసి మ‌రొక శుభ‌వార్త‌ను మోసుకోచ్చింది. ఇక నుంచి సిటి బ‌స్సుల్లో క్యాష్‌లెస్ ప్ర‌యాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన‌లో ఉంది తెలంగాణ ఆర్‌టిసి యాజ‌మాన్యం..ఇదేంటండి.. పండ‌గ ఆఫ‌ర్ల‌న్నీ ఆర్‌టిసి ప్ర‌క‌టిస్తుంద‌ని అని అనుకుంటున్నారా...! సాధార‌ణంగా బ‌స్సులో ప్ర‌యాణించే ప్ర‌తి ప్ర‌యాణికుడికి ఎదుర‌య్యే స‌మ‌స్య ఏంటి? చిల్ల‌ర స‌మ‌స్య‌. టిక్కెట్‌కు స‌రిప‌డ చిల్ల‌ర లేక‌పోవ‌డం. బ‌స్సు దిగాక కండ‌క్ట‌ర్ ఇస్తాన‌న‌డం.. కొన్ని బ‌స్సుల్లో అయితే, ఏకంగా చిల్ల‌ర ఉంటేనే ఎక్క‌నివ్వ‌డం జరుగుతుంది. ఇలాంటి స‌మ‌స్య‌లు బస్సులో ప్ర‌యాణించేవారికి నిత్యం ఎదుర‌వుతూనే ఉంటాయి.

ఈ చిల్ల‌ర స‌మ‌స్య‌కు తెలంగాణ ఆర్‌టిసి ముగింపు ప‌ల‌క‌నుంది. ప‌ట్టణంలోని అన్ని ర‌కాల సిటి బ‌స్సులో యూపిఐ ద్వారా టికెట్ అందించే ప్ర్రక్రియ‌ను ప్రారంభించింది తెలంగాణ ఆర్‌టిసి. దీనివ‌ల్ల అటు ప్ర‌యాణికులు, ఇటు కండ‌క్ట‌ర్ల‌కు ఎటువంటి ఇబ్బందులు ఉండ‌వు. దీంతో సిటి బ‌స్సుల్లో ఉండే చిల్లర స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ క్ర‌మంలో ప‌ట్ట‌ణంలో తిరిగే 2,500కు పైగా ఉన్న ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో యూపీఐ సేవల ద్వారా టికెట్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన మెట్రో లగ్జరీ, ఏసీ బస్సుల్లో యూపీఐ విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే ఎయిర్ పోర్టుకు తిరిగే ఏసీ బస్సుల్లోనూ క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ జారీ చేస్తున్నారు.

Good news for TS passengers..Henceforth cashless travel in city bus..

పెరిగిన టిక్కెట్ ధ‌ర‌లు : నిజం చెప్పాలంటే... బస్సుల్లో టికెట్ తీసుకునేటప్పుడు చిల్లర సమస్యలు మమూలుగా ఉండవు. చిల్లర విషయంలో కండక్టర్లు, ప్రయాణీకులు గొడవలు పడిన సంఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయి. ఈ సమస్యను నివారించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం టిక్కెట్ ధ‌ర‌ల‌ను కూడా రూ. 10, 15, 10 ఇలా పెంచింది. అయినా ఈ స‌మ‌స్య‌లు స‌ద్దుమ‌ణ‌గ‌లేదు. ఇప్పుడు ఆ స‌మస్య‌ల‌ను పూర్తిగా నివారించేందుకు తెలంగాణ ఆర్‌టిసి యూపిఐ సేవ‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇప్పుడూ సిటీ బస్సుల్లో యూపీఐ ద్వారా టికెట్ జారీ చేసేందుకు బస్సుల్లో ఐ-టీమ్స్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చే ప‌నిలో ఉంది ఆర్టీసీ యాజమాన్యం.

ఇప్పటికే ఐ టీమ్స్ యంత్రాలను పంపిణీ చేసే సంస్థతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు ఆర్టీసీ గ్రేడర్ జోన్ అధికారులు తెలిపారు. ఇది విజ‌య‌వంత‌గా పూర్త‌యితే రాష్ర్టంలో ఉన్న‌ 8,300 బస్సుల్లో ఈ ప‌ద్ధ‌తిని దశలవారీగా అమ‌లు చేయాల‌ని ఆర్టీసీ యాజమాన్యం చూస్తోంది. ఇందులో భాగంగానే 700 సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఐ-టిమ్స్ ను ప్రవేశ పెట్టారు. మిగిలిన 8,300 బస్సుల్లో సాధారణ టిమ్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ మిగిలిన వాటిలో క్యాష్ లెస్ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది.

ద‌స‌రాకు మ‌రో ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన ఆర్‌టిసి : పండుగ‌లు రాగానే సిటీల్లో ఉండే వారు ఏం చేస్తారు. వారి సొంతగ్రామాల‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతారు. కానీ, ఈ పండుగల స‌మ‌యంలో ఏ బ‌స్టాండ్ చూసినా, ఏ స్టేష‌న్ చూసినా ర‌ద్దీగా క‌నిపిస్తోంటుంది. అయితే, ఈ సారి ద‌సరా సెల‌వుల‌కు ఊళ్ల‌కు బ‌య‌లుదేరే వారికి తెలంగాణ ఆర్‌టిసి ఓ బంఫ‌రాఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ముందస్తు టికెట్ బుక్ చేసుకునేవారికి 10 శాతం రాయ‌తీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే, ఈ ఆఫ‌ర్ కేవ‌లం అక్టోబర్ 15 నుంచి 29వ‌ తేదీ మధ్యలో ప్రయాణం చేసేవారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. తిరుగు ప్రయాణంపై కూడా 10 శాతం డిస్కౌంట్ కల్పించనున్న‌ట్లు టిఎస్ ఆర్‌టిసి తెలిపింది. ఈ రిజర్వేషన్ సదుపాయాన్ని ప్ర‌యాణికులు ఉపయోగించుకోవాలని ఆర్‌టిసి కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+