ఆర్టీసీ శుభవార్త.. ఆ నాలుగురోజులు నాలుగువేల బస్సులు!

ఆసియాలోనే అతిపెద్ద జాతర, విగ్రహాలు లేని విశిష్టమైన జాతర, తెలంగాణ కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు శర వేగంగా పనులు జరుగుతున్నాయి. 2026 సంవత్సరంలో జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే మేడారం మహా జాతరకు కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం మినీ మేడారం జాతర జరుగుతుండగా, రెండేళ్లకోసారి మహా జాతర జరుగుతుంది.

భక్తులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ
అటువంటి మేడారం మహా జాతరకు ఇప్పటినుంచే అన్ని విభాగాల నుండి పనులు చేస్తున్నారు. మేడారం మహా జాతర నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ భక్తుల కోసం శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం నాలుగు వేల ఆర్టీసీ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మేడారం జాతరకు కావలసిన రోడ్ల అభివృద్ధి పనులను, భక్తులకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడం పైన దృష్టి సారించిన ప్రభుత్వం ఈ మేరకు తగు చర్యలు తీసుకుంటుంది.

good-news-from-rtc-4-000-buses-in-those-four-days-for-medaram-maha-jatara-and-new-busstand-too

Take a Poll

కొత్త బస్టాండ్ కు భూమి పూజ
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాలుగువేల బస్సులను నడుపుతామని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్, వరంగల్ ఆర్ఎండి వెల్లడించారు. ఈ క్రమంలో వీరు మేడారంలో పర్యటించి అక్కడ బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మేడారంలో వై జంక్షన్ లో కొత్తగా నిర్మించబోయే బస్టాండ్ కు, ఆర్టీసీ అధికారులు భూమిపూజ చేసి, మేడారం మహా జాతరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తుల కోసం ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు.

ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించొద్దు
వై జంక్షన్లో కొత్త బస్టాండ్ ను నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. భక్తులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా, ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి సంస్థను ఆదరించాలని వారు విజ్ఞప్తి చేశారు.మరోవైపు మేడారం మహా జాతర నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ 30 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనుంది. ఇదే విషయాన్ని ములుగు డిఎంహెచ్ఓ గోపాలరావు వెల్లడించారు.

మహా జాతర భక్తుల కోసం 1050 ఎకరాల పార్కింగ్ స్థలాలు
మేడారం జాతరలో ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు కోసం కూడా ఆయన స్థల పరిశీలన చేశారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి, ఉచిత వైద్య సేవలు అందించడానికి ఆయన స్థల పరిశీలన చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి డాక్టర్లు, సిబ్బంది వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఇక మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం సుమారు 1050 ఎకరాలలో పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం మేడారం మహా జాతరకు సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+