ఆ ప్రాంత దశ మార్చేలా కేంద్రం వరాలు, 12వేల మందికి ఉద్యోగాలు!

హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పైన స్థానికులు అందరూ సంతోషపడే శుభవార్త. ఓరుగల్లు దశ మార్చేలా, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కంపెనీల పెట్టుబడులను ఆహ్వానించడానికి కేంద్రం తగిన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల వరంగల్లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం కేంద్రం నిధులు
దేశంలోని 7 మెగా టెక్స్ టైల్ పార్కుల్లో ఒకటైన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనుల గురించి ఇటీవల సమీక్షించిన ఆయన ఇప్పటికే భూసేకరణ పనులు దాదాపు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30 కోట్లు అందజేశాం. మరో రూ.30 కోట్లు త్వరలోనే కేటాయిస్తాం అని వెల్లడించారు.

Good news on kakatiya Mega textile park warangal creating jobs for 12 000 people

1100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న మరో కొరియా కంపెనీ
మొత్తం రూ.200 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఈ మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మాణం చేపట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ పార్కు ద్వారా రూ.1,700 కోట్ల పెట్టుబడులు వస్తాయి. 12,500 మందికి ఉపాధి కలుగుతుంది. ఎవర్ టాప్ టెక్స్ అనే కొరియా కంపెనీ రూ.1100 కోట్ల మేర ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టనుంది. 11 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఒప్పందం చేసుకుందన్నారు.

కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో సంతోషంలో ఓరుగల్లు వాసులు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారిని ఆహ్వానించి పార్కు భూమిపూజ చేయించాలనే ఉద్దేశంతో ఉన్నాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం దీని ద్వారా సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి చెప్పడంతో ఓరుగల్లు వాసులు సంతోషంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండల పరిధిలోని శాయంపేట గ్రామం, సంగెం మండలం పరిధిలోని చింతపల్లి గ్రామాలలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం జరుగుతుంది.

2వేల నుండి 3 వేల ఎకరాల విస్తీర్ణంలో మెగా టెక్స్ టైల్ పార్క్
మొత్తం 2వేల నుండి 3 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రాజెక్టు కావడంతో దీని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ దీనిని పర్యవేక్షిస్తుంది. ఈ పార్కులో పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి అన్ని మౌలిక వసతులను కల్పిస్తున్నారు.

ఇప్పటికే ప్రొడక్షన్ మొదలెట్టిన కంపెనీలు
ఎక్కువ భాగం మహిళలకు దీని ద్వారా ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఈ పార్కులో ఏర్పాటు చేసిన యంగ్ వన్ కార్పొరేషన్ కంపెనీ 2025 అక్టోబర్ నుండి తన వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ ప్రొడక్షన్లో దూసుకుపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+