Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్రాంతికి అదిరిపోయే బహుమతి ప్రకటించిన రేవంత్ సర్కార్!

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం నిరుపేద ప్రజలు ఎదురుచూస్తున్నారు. అర్హత ఉన్నప్పటికీ కొత్త రేషన్ కార్డులు రాక ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు రేషన్ కార్డులు ఇస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాలుగా రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో కొత్తగా పెళ్లి చేసుకున్న నిరుపేదల కుటుంబాలతో వేరుపడినవారు ఇప్పటివరకు రేషన్ కార్డు లేనివారు రేషన్ కార్డు కోసం నిరీక్షిస్తున్నారు.

కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన
రేషన్ కార్డు ద్వారా వచ్చే బియ్యం, సరుకుల కోసం మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అమలవుతున్న అన్ని ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు లింక్ ఉండడంతో రేషన్ కార్డు లేని వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా రేషన్ కార్డుల మంజూరు పైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలిలో ప్రకటన చేశారు.

good news to the poor new ration cards and fine rice distribution in ration shops from sankranti 2025

సంక్రాంతి నుండి కొత్త రేషన్ కార్డులు
సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండవరోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ త్వరలోనే చేపడతామని పేర్కొన్న మంత్రి సంక్రాంతి నుంచి రేషన్ కార్డుల మంజూరు ఉంటుందని తెలిపారు. ఇక రేషన్ కార్డులను మంజూరు చేసే విషయంపైన క్యాబినెట్ సబ్ కమిటీ వేసినట్టు ఆయన పేర్కొన్నారు.

కొత్త రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం కూడా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే ఆలోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం మాత్రమే కాకుండా సన్న బియ్యం కూడా ఇస్తామని మంత్రి శాసనమండలి వేదికగా ప్రకటన చేశారు.

కులగణన డేటా ఆధారంగా కొత్త రేషన్ కార్డులు
ఇప్పటికే కులగణనపైన డేటా సేకరించమని పేర్కొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త రేషన్ కార్డులపైన దరఖాస్తులు తీసుకొని ప్రభుత్వం వద్ద ఉన్న డేటాబేస్ తో కంపేర్ చేసి కొత్తకార్డులు ఇస్తామని తెలిపారు. ఇక రేషన్ డీలర్ల ఖాళీలు ఉంటే వాటిని వెంటనే భర్తీ చేయాలని కూడా ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఇక తాజా ప్రకటనతో రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న వారిలో సంతోషం వ్యక్తం అవుతుంది.

మంత్రికి రేషన్ కార్డులపై శాసనమండలి చైర్మన్ గుత్తా సూచన
కాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం వెళుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు . అనర్హులైన వారు రేషన్ కార్డులు పొంది ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారని, అనర్హుల రేషన్ కార్డులను ఏరివేయాల్సిన అవసరం ఉందని మంత్రికి సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+