Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇల్లు కట్టుకోవాలనుకునే హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త!

గ్రేటర్ హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి శుభవార్త. హైదరాబాదులో ఇల్లు కట్టుకోవాలంటే ఇంటి అనుమతి తీసుకోవడం దగ్గర నుంచి, ఇంటి నిర్మాణానికి కావలసిన ఇసుకను తెచ్చుకోవడానికి కూడా నానా తిప్పలు పడాల్సి ఉంటుంది. విపరీతంగా ఇసుక ధరలు పెంచేసి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ టిజిఎండిసి కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ ఇసుక బజార్ లు
ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో రెండు, మూడు వేల రూపాయలు అదనంగా తీసుకుని విక్రయిస్తున్న ఇసుక దందాకు చెక్ పెట్టడం కోసం ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది.
ఇసుక బజార్లలో నేరుగా, వేగంగా, తక్కువ ధరకు ఇసుకను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ చర్యలలో భాగంగానే టీజీ ఎండీసీ హైదరాబాద్లో గృహ నిర్మాణ దారులు, మరియు సామాన్య ప్రజల అవసరాలకు తగినట్టుగా ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చింది.

good news to those who are constricting houses in hyderabad sand bazars with low prices

Take a Poll

ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నాలుగు చోట్ల ఇసుక బజార్ లు
ఇసుక కావలసినవారు ఫోన్ చేస్తే 48 గంటల్లోనే ఇసుకను ఇంటికి నేరుగా సరఫరా చేసేలాగా ఏర్పాట్లు చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ అబ్దుల్లాపూర్మెట్, వట్టినాగులపల్లి, బౌరంపేట, ఆదిభట్లలో మొత్తం నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించి ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో 1,78,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో నిర్మాణదారులకు రిలీఫ్
గతంలో వివిధ జిల్లాల నుంచి ఇసుకను హైదరాబాద్ కు తీసుకువచ్చి ప్రైవేట్ వ్యాపారదారులు అధిక ధరలకు విక్రయించేవారు. ఇక అవసరాన్ని బట్టి ప్రజలకు కొనక తప్పేది కాదు. కానీ ప్రస్తుతం ప్రభుత్వమే నేరుగా ఇసుక బజార్లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు తీసుకొని విక్రయిస్తూ ఉండడంతో గృహ నిర్మాణదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

త్వరలో మరిన్ని చోట్ల ఇసుక బజార్ లు
ఈ నాలుగు చోట్ల మాత్రమే కాకుండా త్వరలో శామీర్ పేట, ఘట్కేసర్ ప్రాంతాలలో కూడా ఇసుక బజార్ లను ఏర్పాటు చేస్తామని టీజీఎండీసీ అధికారులు చెబుతున్నారు. ఎవరికైనా ఇసుక కావాలంటే టీజీఎండీసీ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇసుక రీచ్ నుండి దూరాన్ని బట్టి వాహనాల అద్దె చెల్లించాలని, ఆర్డర్ చేసిన 48 గంటల్లో ఇసుకను ఇంటికి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇసుక బజార్ ల ఏర్పాటు గుడ్ న్యూస్
ప్రస్తుతం ఈ నాలుగు ప్రాంతాలకు నల్గొండ, కొత్తగూడెం రీచ్ ల నుంచి ఇసుక సరఫరా అవుతున్నట్టు చెబుతున్నారు. గృహ నిర్మాణాలు చేసుకోవాలనుకునే సామాన్యులకు తక్కువ ధరకు ప్రభుత్వమే ఇసుకను అందించే ఇసుక బజార్లను ఏర్పాటు చేయడం ఒక శుభ పరిణామంగా చెప్పాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+