టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: పీఆర్సీకి కేసీఆర్ సర్కారు గ్రీన్ సిగ్నల్, కానీ

హైదరాబాద్: దీపావళి పండగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ సహకారంతో సంస్థ ఉద్యోగులకు బస్ భవన్ సాక్షిగా వంద కోట్ల పెండింగ్ బకాయిలు.. దీపావళి పండగ అడ్వాన్సులు ప్రకటించినట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.

ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని విధాలుగా సీఎం సహాయ సహకారాలు అందిస్తున్నారని గోవర్ధన్ తెలిపారు. ఇందులో భాగంగానే ఉద్యోగుల పీఆర్సీపై కూడా చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు. 2017 నుంచి పీఆర్సీ పెండింగ్‌లో ఉందని, దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రభుత్వానికి లేఖలు రావడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి.. ఎన్నికల ప్రధాన అధికారికి లేఖలు పంపారన్నారు.

 Good news to TSRTC employees: KCR govt green signal for PC

మునుగోడు ఉపఎన్నిక నియమావలి అమలులో ఉన్నా.. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఆ ప్రక్రియ ప్రారంభించడానికి.. ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరినట్లు తెలిపారు. ఎన్నికల అధికారి నిర్ణయం తర్వాత.. ఉద్యోగులకు సీఎం ఆదేశాల మేరకు పీఆర్సీ అమలు చేస్తామని ఆర్టీసీ ఛైర్మన్ గోవర్ధన్ తెలిపారు. ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+