గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గూగూల్ ఉద్యోగిని హేమ

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓ గూగుల్ ఉద్యోగిని తన జాతకాన్ని పరీక్షించుకుంటున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఈసారి మహిళలు పెద్ద యెత్తున రంగంలోకి దిగారు. విద్యావంతులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఆయా పార్టీల తరఫున ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యనభ్యసించిన వారు పోటీలో ఉన్నారు.

అధికార టీఆర్‌ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో యువతకు, విద్యావంతులకు ప్రాధాన్యమిచ్చింది. సీతాఫల్‌మండి డివిజన్ నుంచి పోటీ చేస్తున్న సామల హేమ ఎంబీఏ పూర్తి చేశారు. గూగుల్ సంస్థలో ఉద్యోగిగా ఉన్న హేమ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు.

Google lady employee in GHMC elections

ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలనై రాజకీయాల్లో చేరినట్లు ఆమె తెలిపారు. జేఎన్‌టీయూలో ఎంబీఏ చేసిన సామల హేమ 2013 నుంచి రెండేళ్ల పాటు జెన్‌పాక్‌లో పనిచేశారు. గత సంవత్సరం గూగుల్‌లో చేరారు.

తండ్రి కరాటే రాజు టీఆర్‌ఎస్ నేత కావడంతో తనకు చిన్నప్పటి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేదని అన్నారు. నగరంలో టీహబ్ ఏర్పాటు ఎంతో మంది యువతకు అవకాశాలు కల్పిస్తున్నదని, ఇలాంటి ప్రజా సంక్షేమ ప్రభుత్వంతో కలిసి నడిచేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. సీతాఫల్ మండి డివిజన్ ప్రజలు తనను ఖచ్ఛితంగా ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+