రైతు భరోసా ఇక వారికే - పరిమితులు, నిబంధనలు..!!

రేవంత్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహి స్తోంది. రైతులకు ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ ఘనత తమదేనని సీఎం చెబుతున్నారు. తాజాగా రైతుభరోసా అమలు పైన రేవంత్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుబంధు అమలు పై అసెంబ్లీలో ప్రవేశ పెట్టే నివేదిక పైన చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. సంక్రాంతి తరువాత నిధులు జమ చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో నిబంధనలు, పరిమితుల పైన కసరత్తు జరుగుతోంది.

రేవంత్ హామీ
రైతుభరోసా పైన ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టత ఇచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో ఈ పథకం అమలు పైన నివేదిక సిద్దం అవుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక ప్రవేశ పెట్టి చర్చించాలని నిర్ణయించారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తరువాత నిజమైన రైతులకు పథకం అమలయ్యేలా నిర్ణయం చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. తాము హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరు అడ్డువచ్చినా పథకం అమలు ఆగదని పేర్కొన్నారు. నిర్ణయించిన అర్హతల మేరకు రైతుల ఖాతాల్లో సంక్రాంతి తరువాత నిధులు జమ అవుతాయని ప్రకటించారు.

Government to submit recommendations for implementation of Rythu Bharosa in assembly Sessions

నివేదిక పై కసరత్తు
అయితే, ఇప్పటికే సిద్దం అవుతున్న నివేదికలో కొన్ని కీలక సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో నిజమైన రైతులకే మేలు కలిగేలా కొందరిని మినహాయించటంతో పాటుగా పొలం పరిమితి ఖరారు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయపు పన్ను (ఐటీ) చెల్లింపుదారులకు రైతుభరోసా ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పది ఎకరాలకు పరిమితం చేసే అంశం పైన ప్రతిపాదన చేయనున్నారు. దీని పైన అసెంబ్లీలో అన్ని పక్షాల నుంచి అభిప్రాయ సేకరణ చేసి..తుది నిర్ణయానికి రానున్నారు. ఉద్యోగుల పేర్ల పైన ఉన్న భూమికి పెట్టుబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ నిర్ణయంతో
దీంతో, అసెంబ్లీలో ప్రభుత్వం చేసే ప్రతిపాదనలు ఏంటనేది కీలకంగా మారనున్నాయి. సభలో ప్రభుత్వ చేసే ప్రతిపాదనల పైన అన్ని పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. అదే విధంగా బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన పథకంలో లోటు పాట్లు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. దీంతో, పక్కాగా అర్హత ఉన్న ప్రతీ రైతుకు పథకం అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. కాగా, ఇప్పుడు అసెంబ్లీ వేదికగా రైతుభరోసా అమలు పై ప్రభుత్వం చేసే ప్రకటన పైన రైతుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+