కేటిఆర్‌కు బిగ్‌షాక్‌, విచారణకు గవర్నర్ అనుమతి - ఇక నెక్స్ట్..!!

మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్. ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌‌ను విచారించడానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. నిధుల దుర్వినియోగం పై విచారణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏసీబీ త్వరలో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత చార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో, ఇప్పుడు ఈ కేసులో కేటీఆర్ పై తదుపరి చర్యల పై ఉత్కంఠ కొనసాగుతోంది.

కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. కేటీఆర్ పైన నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఇప్పటికే నాలుగు సార్లు విచారణ చేసింది. కాగా, కేటీఆర్‌ ప్రజాప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్‌ అనుమతి కోరుతూ ఇటీవల ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సానుకూలంగా స్పందిస్తూ కేటీఆర్‌పై విచారణకు అనుమతి ఇచ్చారు. ఈ ఫార్ములా ఈ కార్ రేసు కోసం స్పాన్సర్‌షిప్‌ చేసిన సంస్థ నుంచి.. ఈ రేస్ నిర్వహించిన సంస్థకు రూ.44 కోట్లు చెల్లింపులు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దానికి బదులుగా ఆ స్పాన్సర్‌షిప్‌ సంస్థ నుంచి రూ.44 కోట్ల విలువైన ఎలక్టోరల్‌ బాండ్‌‌ను బీఆర్ఎస్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే విజిలెన్స్ కమిషన్ నివేదిక విచారణలో కీలకంగా మారింది.

governor-gave-nod-to-act-against-ktr-in-formula-e-race-irregularities

ఫార్ములా ఈ కేసులో క్విడ్ ప్రో కో జరిగినట్లు ఏసీబీ నిర్దారించింది. ఈ కేసులో తదుపరి చర్యల కోసం గవర్నర్ అనుమతి కోరింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సమయంలోనూ సీఎం రేవంత్ ఈ కేసు అంశాన్ని ప్రస్తావించారు. తాను కేటీఆర్ ను అరెస్ట్ చేయాలనకున్నానని.. కాగా, గవర్నర్ నుంచి అనుమతి రాలేదని చెప్పుకొచ్చారు. అయితే, కేటీఆర్ మాత్రం తాను హైదరాబాద్ బ్రాండ్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనను అరెస్ట్ చేయాలని అనుకుంటే తాను సిద్దమేనని స్పష్టం చేసారు. ఇప్పుడు గవర్నర్ ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ విచారణ.. ఛార్జ్ షీట్ కు అనుమతి ఇవ్వటంతో నెక్స్ట్ స్టెప్ ఏంటనేది రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+