రైతుల ఖాతాల్లో నిధులు, మహిళలకు సైతం..!!

రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. పరేడ్‌ గ్రౌండ్‌లో గవ ర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజాపాలనలో సాధించిన విజయాలను వివరించారు. ప్రభుత్వ లక్ష్యాలను స్పష్టం చేసారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. దావోస్ పెట్టుబడులతో అగ్రగామిగా రాష్ట్రం నిలవనుందని పేర్కొన్నారు. నేటి నుంచి అమలు కానున్న నాలుగు పథకాల గురించి వివరించారు. రైతులు.. మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తన రిపబ్లిక్ డే ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించారు. తాజాగా సీఎం రేవంత్ టీం దావోస్ పర్యటనలో చేసుకున్న ఒప్పందాలను ప్రస్తావించారు. దావోస్ 1.79 లక్షల కోట్ల పెట్టుబడులతో అగ్రగామిగా రాష్ట్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందని గవర్నర్‌ తెలిపారు. ఐటీ, ఫార్మా రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతోందని వివరించారు. ప్రజా ప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి పెద్ద పీట వేస్తుందని స్పష్టం చేసారు. అందులో భాగంగానే అందెశ్రీ రాసిన జయ జయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారని గవర్నర్ గుర్తు చేశారు.

Governor Jishnu Dev Varma delivered Republic day speech highlighting Telangana s progress and achievements

తెలంగాణ ఆర్దిక రంగానికి వ్యవసాయం వెన్నుముకగా ఉందని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా 25 లక్షల మందికి పైగా రైతుల రుణాలు మాఫీ చేశారని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం రైతులకు రైతు భరోసా అందిస్తోందని వెల్లడించారు. అదే విధంగా వ్యవసాయ కూలీల కోసం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

సన్నరకం బియ్యానికి బోనస్‌ అందించని అంశాన్ని ప్రస్తావించారు. 2024 వానాకాలంలో 1.59 కోట్ల టన్ను ధ్యానం ఉత్పత్తి చేసినట్లు వివరించారు. ఉచిత బస్సు రవాణాతో మహిళలకు రూ.4500 కోట్లు ఆదా చేశామని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి అందిస్తున్న ట్లుగా గవర్నర్ వివరించారు. యువత సాధికారత కోసం యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనిర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్‌ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+