ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలిపూజ: భారీగా తరలివచ్చిన భక్తులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోనేగాక, దేశంలో ప్రాముఖ్యత కలిగిన ఖైరతాబాద్ మహా గణపతి కొలువుదీరాడు. 63 అడుగుల మహా గణపతికి తొలి పూజ జరిగింది. గణేశుడు ఈసారి 'శ్రీ దశమహా విద్యా గణపతి'గా భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామివారికి కుడి వైపున లక్ష్మీనరసింహస్వామి, ఎడమవైపున వీరభద్రస్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. తొలి రోజు ఖైరతాబాద్ గణనాథుని చూసేందుకు భక్తులు పోటెత్తారు.
11 రోజులపాటు ఘనంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 11 గంటలకు మహా గణపతికి తొలి పూజ జరిగింది. ఈ పూజలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచే మహా గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు, అక్కడ ఏర్పాటు చేసిన చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంతకుముందు ఖైరతాబాద్ గణనాథుడికి భారీ లడ్డును నిర్వాహకులు సమర్పించారు. ఈసారి 63 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీదశమహా విద్యాగణపతికి మొదటగా పద్మశాలి సంగం తరపున పట్టువస్త్రాలు, గరికపూస, వెండి జంజాన్ని నిర్వాహకులు సమర్పించారు.

ఖైరతాబాద్ గణనాథుడి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో పోలీసులు ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్, షాదన్ కాలేజ్, నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, మింట్ కంపౌండ్, నెక్లెస్ రోటరీ దగ్గర ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు.
Honoured to perform the Inaugural puja to the 40-ft tallest #Ganesha idol at the famous Khairatabad Ganesh Pandal in #Hyderabad today.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) September 18, 2023
Alongside Hon'ble Governor of Haryana Shri Bandaru Dattatreya ,MLA Shri.Dhanam Nagender & Other Guests.#GaneshaFestival#GaneshChaturthi2023… pic.twitter.com/OCYBSZvv1m

కాగా, మట్టితో చేసిన ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులుగా సిద్ధం చేశారు. ఏటా మాదిరిగానే ప్రధాన మండపం రెండు వైపులా ఇతర దేవతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. కుడివైపు శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలు దాదాపు 15 అడుగుల ఎత్తున రూపుదిద్దుకున్నాయి. దాదాపు 150 మంది కళాకారులు 100 రోజులు శ్రమించి ఈ భారీ గణనాథుడి విగ్రహాన్ని తయారు చేశారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications