Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా..!!

తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసారు. ఈ మేరకు రాష్ట్రపతికి తన రాజీనామా లేఖ పంపారు. ప్రధాని మోదీ రాజ్ భవన్ లో బస చేసిన సమయం లోనే ఈ మేరకు నిర్ణయం జరిగింది. తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీకి డిసైడ్ అయ్యారు. తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరగనుంది.

తమిళిసై రాజీనామా
తెలంగాణ గవర్నర్ పదవి కి తమిళిసై రాజీనామా చేసారు. ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యారు. ఏపీలో పర్యటన ముగించుకొని వచ్చిన ప్రధాని రాజ్ భవన్ లో బస చేసారు. ఆ సమయంలో తమిళసైను ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలనే చర్చ జరిగింది. ప్రధాని సూచనతో వెంటనే తమిళసై తన పదవికి రాజీనామా చేసారు. తెలంగాణ గవర్నర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు.

Governor Tamilisai steps down for Lok Sabha race on PM Modis call

ఈ ఎన్నికల్లో చెన్నై సెంట్రల్, తుత్తుకూడి నుంచి తమిళసై పోటీకి దిగటం ఖాయమైందని తెలుస్తోంది. 2019లో తమిళసై తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికి మూడుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తమిళిసై.. నాలుగోసారి ఎంపీగా పోటీకి సిద్దం అవుతున్నారు.

రాజకీయ కుటుంబం నుంచి
తమిళసై 2006లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి రామనాథపురం నియోజకవర్గం నుంచి బరిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఇప్పటివరకు ఒక్క విజయం దక్కలేదు. తమిళసై తండ్రి కమరి ఆనంద్ తమిళనాడు పీసీసీ చీఫ్ గా పని చేసారు. తమిళసై 1999 లో బీజేపీలో చేరారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా.. అధ్యక్షురాలిగా.. జాతీయ కార్యదర్శిగా పదవులు నిర్వహించారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రామనాథపురం స్థానం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2009 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరచెన్నై నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయారు. 2011, 2019 ఎన్నికల్లోనూ తమిళిసైకు ఓటమి తప్పలేదు.

ప్రధాని సూచనతో రాజీనామా
ఆ రువాత తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్‌కి కొరకరాని కొయ్యగా మారారు. పలు బిల్లుల పట్ల కఠినంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీల విషయంలోను తనదైన మార్కును చూపించారు. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో మటుకు సఖ్యతతో ఉంటున్నారు. కొంత కాలంగా తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఆ పరిణామాల్లో తమిళ సై వ్యక్తం చేసిన అభిప్రాయాల సమయంలోనే తిరిగి తమిళసై రాజకీయంగా యాక్టివ్ కానున్నట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు ప్రధాని హైదరాబాద్ లో మకాం వేసిన సమయంలోనే గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేసారు. దీంతో, ఇప్పుడు తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం పైన కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+