ప్రధాని తో గవర్నర్ తమిళిసై భేటీ - కీలక వ్యాఖ్యలు : పీఎంకు అంతా తెలుసు - అవమానించారు..!!
తెలంగాణ ప్రభుత్వం..గవర్నర్ మధ్య కొంత కాలంగా కంటిన్యూ అవుతున్న గ్యాప్ వ్యవహారం ఢిల్లీకి చేరింది. తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సమావేశం తరువాత గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేసారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పైన తాను ప్రధానికి ధన్యవాదాలు తెలిపినట్లు వెల్లడించారు. ఇక, తెలంగాణ అంశాల పైన స్పందించారు. తాను తెలంగాణలో అధికారం చెలాయించటం లేదని చెప్పుకొచ్చారు..తాను ఫ్రెండ్లీ గవర్నర్ గా అందరితో సన్నిహితంగానే ఉన్నానని చెప్పారు. తాను రాజ్యంగ బద్దమైన పదవిలో ఉన్నానని పేర్కొన్నారు.
వ్యక్తిగతంగా తనను కాదు..గవర్నర్ ను అవమానించారు
తనకు వ్యక్తిగతంగా గౌరవం గురించి తాను మాట్లాడటం లేదని.. రాజ్ భవన్ కు .. గవర్నర్ గౌరవానికి సంబంధించినదని వివరించారు. ప్రధానికి తెలంగాణలో పరిణామాల గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని..ప్రధానికి అంతా తెలుసని గవర్నర్ వ్యాఖ్యానించారు. తాను ఏ విషయం పైన అయినా చర్చకు సిద్దంగా ఉన్నానని..తన కార్యాలయానికి ఎవరు వచ్చినా..అన్ని విషయాలు వింటానని స్పష్టం చేసారు. ప్రభుత్వం వ్యక్తిగతంగా తనకు గౌరవం ఇవ్వాలని తాను కోరుకోవటం లేదని..గవర్నర్ హోదాకు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం తనకు ఎటువంటి నివేదికలు ఇవ్వటం లేదన్నారు.
సీఎస్ కు ప్రోటోకాల్ తెలియదా అంటూ
అక్కడ జరుగుతున్న పరిణామాలను ప్రజలకే వదిలేస్తున్నానని చెప్పుకొచ్చారు. తనకు ఎలాంటి ఇగో లేదని స్పష్టం చేసారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రోటోకాల్ తెలియదా అంటూ గవర్నర్ ప్రశ్నించారు. తాను ఎక్కడా అధికారం చెలాయించటం లేదని చెప్పారు. ఏ చర్యలు తనను ఆపలేవని స్పష్టం చేసారు. తనతో సమావేశం కావాలని సీఎం భావిస్తే..ఎప్పుడైనా రాజ్ భవన్ కు రావచ్చని గవర్నర్ పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎంలో ఎలుకల ఘటన చాలా బాధ కలిగించిందని చెప్పారు. తనను అవమానించారని..అయినా, తాను పట్టించుకోనన్నారు. తెలంగాణ ప్రజలను తాను అభిమానిస్తానని గవర్నర్ పేర్కొన్నారు.

కౌశిక్ రెడ్డి ఫైల్ ఆమోదించలేదు..
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో తన ప్రసంగం లేకుండా చేయటం అవమానించటమేనని చెప్పారు. కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎంపిక చేసారని...సేవా రంగంలో ఉన్న వారినే గవర్నర్ కోటాలో ఎంపిక చేస్తారని చెప్పారు. అందుకే ఆ ఫైల్ ను పక్కన పెట్టాల్సి వచ్చిందని..ఆ విషయం తాను ప్రభుత్వానికి స్పష్టం చేసానని గవర్నర్ వెల్లడించారు. తాను తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటానికే ప్రయత్నించానని వివరించారు. గవర్నర్ ప్రధానితో సమావేశంలో ఈ విషయాలు అన్నీ వివరించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనే గవర్నర్ భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications