రైతుల ఖాతాల్లో నిధులు జమ, వారికీ భరోసా - ప్రభుత్వం ప్రకటన..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి తొమ్మది రోజుల్లో 9 వేల కోట్ల నిధులను రైతులకు అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. ఈ రోజు నాలుగు ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. మరో రూ 1313.53 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు.
మరో వారం లోగా పూర్తిగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేసారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నాలుగు ఎకరాల వరకు రైతుభరోసా నిధులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్న రైతులకు ఏ పథకాలను ఆపడం లేదని స్పష్టం చేసారు. రైతుల సంక్షేమం విషయంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో 1313.53 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. దీంతో మరో 21.89 లక్షల ఎకరాలకు సంబంధించిన 6.33 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారని, ఇప్పటి వరకు మొత్తం 5215.26 కోట్లు రైతుభరోసా కోసం విడుదల చేసి, 58.04 మంది రైతులకు సహాయం అందించినట్టు తెలిపారు. 9 రోజుల్లో 9 వేల కోట్లను రైతుల ఖాతాలలో జమ చేస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వరుసగా మూడో రోజు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు తెలిపారు.

govt-credited-rtyhu-bharosa-funds-in-farmers-accounts-up-to-four-acres

ఎకరాలతో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని చెప్పారు. రైతుభరోసా విషయంలో బిఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బిఆర్ఎస్ నాయకులు రైతు భరోసా విషయంలో చేస్తున్న మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక సందర్భంలో మినహా, వానాకాలం రైతుబంధు సహాయం ఎప్పుడు సాగు కాలానికి ముందుగా ఇవ్వలేక పోయిందని విమర్శించారు.

ఏ ఒక్క సందర్భంలో కూడా 3 రోజుల్లోనే 5 వేల కోట్లకు పైగా రైతుబంధు కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవని మంత్రి పేర్కొన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అనాలోచిత పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా, మా ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం దేశానికే ఆదర్శంగా 2 లక్షల లోపు రైతు రుణమాఫి పథకాన్ని పూర్తిచేసి చూపించామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+