రేషన్ కార్డు దరఖాస్తు దారులకు బిగ్ అప్డేట్..!!
తెలంగాణలో రేషన్ కార్డుల కోసం లబ్ది దారులు వేచి చూస్తున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ కార్డు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రాతిపదిక కావటంతో పెద్ద సంఖ్యలో లబ్ది దారులు కొత్త కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. డిజిటల్ విధానంలో కార్డుల జారీకి ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. అదే సమయంలో కార్డుల్లో మార్పులు - చేర్పులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సమయంలో కార్డుల జారీ ప్రక్రియ విధానం పైన అధికారులు బిగ్ అప్డేట్ ఇస్తున్నారు. కొత్త కార్డుల జారీ వేళ కీలక అంశాలను వెల్లడించారు.
కొత్త రేషన్ కార్డుల జారీ పైన ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి, మీ-సేవ, కుల గణన ఇలా అన్ని సందర్భాల్లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను పౌర సరఫరాల శాఖ అధికారులు ఆన్‌లైన్ చేశారు. ఆ వివరాలన్నీ తహసీల్దార్ కార్యాలయాలకు చేరుతున్నాయి. వచ్చిన డేటా ఆధారంగా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఆదాయ స్థితిగతులు, గతంలో కార్డు ఉందా.. ప్రత్యేకంగా కార్డు ఆవశ్యకమా.. తదితర వివరాలు సేకరించి, వారి ఆధార్ కార్డు వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నారు. అనర్హులు అయితే వారి దరఖాస్తును తిరస్కరిస్తున్నారు. అర్హత ఉంటే వారి వివరాలు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి రిపోర్ట్ చేస్తున్నారు.

అందుతున్న నివేదికల ఆధారంగా కొత్త కార్డులను మంజూరు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో చిన్నారు లను కార్డుల్లో లబ్ది దారులుగా చేర్చారు. కానీ, వారికి రేషన్ పంపిణీ పైన కొంత డైలమా పరిస్థితి కని పిస్తోంది. అధికారులు ఈ అంశం పైన స్పష్టత ఇవ్వాలని లబ్ది దారులు కోరుతున్నారు. పిల్లల పేర్లను తమ రేషన్ కార్డులో జతపరచాలని తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకుంటే, ఏకంగా పిల్లల పేరుమీద కొత్త కార్డులు జారీ చేశారు. రేషన్ పంపిణీ చేయాలన్నా తల్లిదండ్రులు ఉండాల్సిందే. అది నిరుపయోగమని లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం వెంటనే వాటిని పిల్లలకు ఇచ్చిన రేషన్ కార్డులను రద్దు చేసింది. జాబితా ఎంపిక ప్రక్రియలో నెలకున్న లోపాల కారణంగా ఇలాంటివి చోటు చేసుకున్నాయి.
దీంతో, కొత్త కార్డుల పంపిణీ వేళ ఇలాంటి సమస్యలను సరి చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉందని లబ్దిదారులు కోరుతున్నారు. అదే సమయంలో కార్డుల్లో మార్పులు - చేర్పులకు దరఖాస్తు చేసుకున్న వారు సైతం వేచి చూస్తున్నారు. పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయటంతో పాటుగా తమకు కార్డులు ఇవ్వాలని గ్రామాల్లోని లబ్ది దారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications