హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రామ జ్యోతి మంచి పథకం: తుమ్మల, తెలంగాణకు 11 పోలీసు సేవా పతకాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ గ్రామ జ్యోతి పథకాన్ని తెచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వైరాలో వాటర్‌ గ్రిడ్‌ పనులను పరిశీలించిన ఆయన అనంతరం ఆయన వైరాలోఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

ప్రతీ ఇంటికి తాగునీరు అందించడానికి సీఎం వాటర్‌గ్రిడ్ పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతున్న గ్రామజ్యోతి గొప్ప పథకమని తెలిపారు. ప్రజలు పది కాలాల పాటు గుర్తుంచుకోవాలంటే స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామజ్యోతిలో భాగస్వాములై పథకాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

త్వరలోనే పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ పటిష్ఠతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. త్వరలో అర్హులైన వారికి నామినేటెడ్‌ పదవులను ఇస్తామని అన్నారు.

grama jyothi is good scheme in telangana says minister tummala

తెలంగాణకు 11 పోలీసు సేవా పతకాలు:

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీసు పతకాలను ప్రకటించింది. ఇందులో తెలంగాణకు 11 పోలీసు పతకాలు, 2 రాష్ట్రపతి పతకాలు లభించాయి. ఐజీ గోవింద్‌సింగ్, నిజామాబాద్ రేంజ్ డీఐజీ గంగాధర్‌కు రాష్ట్రపతి పతకాలు వరించాయి.

పోలీసు సేవా పతకాలు వచ్చిన వారిలో హైదరాబాద్ దక్షిణ మండలం అదనపు డీసీసీ కె. నాగరాజు, ఆక్టోపస్ డీఎస్పీ ఎ.కె. మిశ్రా, గ్రేహౌండ్స్ అథాల్ట్ కమాండర్ ఆర్. వెంకటయ్య, వరంగల్ డీఎస్పీ బి. జనార్ధన్, సైబరాబాద్ ఏసీపీ పి. నారాయణ, కమ్యూనికేషన్ ఇన్‌స్పెక్టర్ రాంగోపాల్, హైదరాబాద్ పీటీసీ ఆర్‌ఎస్‌ఐ గౌస్, సెక్యూరిటీ వింగ్ ఏఎస్‌ఐ తిరుపతిరెడ్డి, ఇంటెలిజెన్స్ హెడ్‌కానిస్టేబుల్ లకా్ష్మరెడ్డి, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ ఎన్. వెంకటేశ్వరరావు, మోతే కానిస్టేబుల్ ఎల్. గోపి, ఎన్‌ఐఏ హైదరాబాద్ విభాగం ఇన్‌స్పెక్టర్ గోపాలన్ రామన్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వెంకటసుబ్రమణ్యంకు పోలీసు సేవా పతకాలు వరించాయి.

English summary
grama jyothi is good scheme in telangana says minister tummala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X