ఊరూ వాడా ఘనమైన పండుగ.!దశాబ్ధి ఉత్సవాలు అంబరాన్నంటాలన్న ఎర్రబెల్లి దయాకర్ రావు.!
హైదరాబాద్: పదేండ్ల సుదీర్ఘ కాలం పరిపానలో ఓ మరచిపోలేని మైలు రాయని, స్వరాష్ట్రంలో సుపరిపాలన చంద్రశేఖర్ రావుకే ప్రత్యేకమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అసాధ్యమనుకున్న రాష్ట్రాన్ని సాధించి సుసాధ్యం చేసిన సీఎం చంద్రశేఖర్ రావు, రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాలను ఓ పండుగలా, మరచిపోలేని ఓ తీపి జ్ఞాపకంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాలను సీఎం చంద్రశేఖర్ రావు మరచిపోలేని విధంగా ఓ గొప్ప గుర్తుగా అందిచాలనుకున్నట్టు ఎర్రబెల్లి స్పష్టం చేసారు.
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు : రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల్లో అధికారులు ప్రజలను భాగస్వాములను చేస్తూ, త్రికరణ శుద్ధితో పని చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి. జూన్ 2వ తేదీ నుండి 23వ తేదీ వరకు 21 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలను సమున్నతంగా నిలిపే విధంగా ఉత్సవాలు జరగాలని ఆశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. సిఎం చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణపై బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం సమీక్షించారు. ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

పల్లె పల్లెనా పండుగలా ఏర్పాట్లు : ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. రాష్ట్రావతరణ జరిగి 10 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, పండుగ వాతావరణంలో రోజుకో కార్యక్రమం చొప్పున మొత్తం 21 రోజుల పాటు తెలంగాణ సాధించిన విజయాలను ప్రజలకు తెలిపేలా నిర్వహించాలని ఎర్రబెల్లి దయాకర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల ఏర్పాట్లు పల్లెపల్లెనా జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకుని, ఆయా గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

గ్రామ గ్రామాన గ్రామ సభలు... పల్లె ప్రగతి నివేదికలు : గ్రామ గ్రామాన గ్రామ సభలు పెట్టాలని చెప్పారు. ఆయా గ్రామ సభల సందర్భంగా ప్రగతి నివేదికలు చదివి ప్రజలకు వినిపించాలన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు ఈ పదేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరించాలన్నారు. ఏయే పథకాలు వచ్చాయి. గ్రామాల్లో ఆయా పథకాల విలువ ఎంత? ఒక్కో పథకం కింద ఒక్కో గ్రామానికి వచ్చిన నిధులు ఎన్ని? మొత్తంగా గ్రామానికి అందిన ప్రగతి ఫలాల మొత్తం ఎంత? అనే వివరాలు ప్రజలకు ప్రగతి నివేదికల రూపంలో వివరించాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు సూచించారు.













Click it and Unblock the Notifications