Revanth Reddy: పేదలకు వరం...అత్యవసర చికిత్సకు సీఎంఆర్ఎఫ్ నిధులు రెట్టింపు..!!

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపుగా ఏడాది కాలం పూర్తయ్యింది. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, సంక్షేమంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అనే ముద్ర పాలనాపరంగా రేవంత్ రెడ్డి వేశారు.తాజాగా వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధిని దాదాపుగా రెట్టింపు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది రేవంత్ ప్రభుత్వం.

సీఎం రేవంత్ ఆలోచన..

జబ్బు చేయడం అనేది మనిషికి సర్వసాధారణం. అయితే జబ్బు నయం చేసేందుకు అయ్యే ఖర్చు మాత్రం కొండంత. ఈ రోజుల్లో వైద్య చికిత్సకు అయ్యే ఖర్చు అంతా ఇంతా కాదు. ఆ ఖర్చు భరించలేక చాలామంది చికిత్స తీసుకోకుండా ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎక్కువగా పేద కుటుంబాల్లో కనిపించాయి. ఇకపై ఏ పేదవాడు డబ్బులేక వైద్యం అందక చనిపోకూడదని భావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో వచ్చింది. ఇప్పటికే సీఎం సహాయ నిధి ద్వారా వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ఏకంగా రూ.830 కోట్లు కేవలం అత్యవసర వైద్య చికిత్స కోసంకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని 1.66 లక్షల మంది పేద మధ్య తరగతి కుటుంబాలు లబ్దిపొందనున్నాయి. ఇదంతా అధికారంలోకి వచ్చిన ఒక ఏడాదిలోనే జరిగింది.

Great Move by Revanth Reddy CMRF Assistance Soars to 830 Crore Offering Hope to Needy Patients

ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్‌ ద్వారా రూ.2400 కోట్లు విడుదల చేసింది. అంటే 2018 నుంచి 2023 వరకు ఏడాదికి సగటున రూ.480 కోట్లుగా ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ సీలింగ్‌ను రూ.10లక్షలకు పెంచడమే కాకుండా 1.66 లక్షల కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలిచింది.ఈ ఏడాది ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చికిత్స చేయించుకుని లబ్ధి పొందిన వారిలో ఎక్కువగా పిల్లలున్నారని సీఎం కార్యాలయం వివరించింది. ఇక సీఎంఆర్ఎఫ్ కోసం ప్రత్యేక గైడ్‌లైన్స్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది.

దరఖాస్తులను వెంటనే పరిశీలించాలి

ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం పొందాలనుకునేవారు దరఖాస్తు దాఖలు చేసిన 24 గంటల్లో దాన్ని పరిగణలోకి తీసుకుని ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.వెంటనే LOCలు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. అప్లికేషన్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ ఒక్కరోజు కూడా ఆలస్యం కాకూడదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఆదివారాలైనా లేదా ఇతరత్ర సెలవుదినాల రోజైనా అప్లికేషన్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్ చేయాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ నిధుల్లో గోల్‌మాల్ జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదల్లో పెద్ద కుంభకోణమే జరిగిందని సీఎం కార్యాలయం చెబుతోంది. పేద ప్రజల పేరుతో బూటకపు మెడికల్ బిల్స్ సృష్టించి డబ్బులు దండుకున్నారనే ఆరోపణలున్నాయి.ఇది గ్రహించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో సీఎంఆర్ఎఫ్‌లో జరిగిన అవినీతిపై దృష్టి సారించింది.దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్ చేస్తూ పారదర్శకత తీసుకొచ్చింది. దీంతో అక్రమాలకు చెక్ పెట్టింది. రేవంత్ తీసుకున్న నిర్ణయంపై పేద మధ్య తరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చికిత్స చేయించుకోవాలంటే అది అయ్యేపని కాదని నాటి కష్టాలను గుర్తుచేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+