తెలంగాణలోని 5 నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డుల ప్రదానం.. లండన్ లో అరవింద్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి ఆలయం సహా ఐదు నిర్మాణాలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గ్రీన్ యాపిల్ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, లండన్‌లోని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ అవార్డులను అందుకున్నారు.
Had the honour of representing the state Government of #Telangana to receive the prestigious "Green Apple awards" at St Paul Cathedral, London in 5 different categories - the most by any state followed by #CBRE UK & Qatar@KTRBRS @TelanganaCMO @asadowaisi pic.twitter.com/ILpweeE2rA
— Arvind Kumar (@arvindkumar_ias) June 17, 2023
తెలంగాణ సచివాలయం, మొజాంజాహీ మార్కెట్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయానికి వివిధ కేటగిరీల కింద ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అవార్డులు లభించాయి. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డు లభించడం విశేషం.

ఇక్కడి భవనాల డిజైన్, ఆర్కిటెక్చర్ ప్రతిభకు ఈ అవార్డులు అద్దం పడుతున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఇప్పటికే వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డ్(2022), ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ అవార్డ్(2021), లివింగ్, ఇన్‌క్లూజన్ అవార్డ్-స్మార్ట్‌సిటీ ఎక్స్‌పో వరల్డ్ కాంగ్రెస్(2021) వంటి ప్రపంచస్థాయి అవార్డులను సొంతం చేసుకుంది.
కాగా, గ్రీన్ యాపిల్ సంస్థ 2016 నుంచి అవార్డులను ప్రదానం చేస్తోంది. పర్యావరణహిత కార్యక్రమాలను ప్రోత్సాహించే విషయంలో విశాలమైన ప్రాంతాల్లో నిర్మాణాలు వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. నివాస, కార్యాలయ భవనాలు, కోటలు, మ్యూజియంలు, వంతెనలు, మతపర కట్టడాల వంటి వాటిని పరిశీలిస్తారు. గ్రీన్ యాపిల్ సంస్థను 1994లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను చేపడుతోంది. ఇది పర్యావరణం విషయంలో కృషి చేస్తున్న సంస్థలు, సంఘాలకు అవార్డులు ఇస్తోంది. పలు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రతి ఏడాది అందిస్తారు. ఇందుకోసం నామినీలను ముందు నుంచే ఆహ్వానిస్తారు.












Click it and Unblock the Notifications