లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో ఘనతను సాధించింది. ప్రతిష్టాత్మక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల అపార కృషిని నిక్షిప్తం చేసే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు చోటు లభించింది.
ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఒక గంటలో అత్యధిక మొక్కలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కు రికార్డ్స్‌లో చోటు కల్పించినట్లు లిమ్కా బుక్ రికార్డ్స్ ఎడిటర్ వత్సాల కౌల్ బెనర్జీ వెల్లడించారు. ఈ మేరకు ప్రశంస పత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఎంపీకి అందించినట్లు ప్రకటించారు.

ఆదిలాబాద్ జిల్లా దుర్గానగర్‌లో 2021 జులై 4న సంతోష్ కుమార్ ప్రత్యేక చొరవతో ఒక గంట సమయంలో 16,900 మంది భాగస్వాములతో 3,54,900 మొక్కలు నాటినట్లు సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు 21 మొక్కలు నాటినట్లు ఆ సంస్థ పేర్కొంది. సమష్టి కృషి, సామాజిక స్పృహకు ఈ కార్యక్రమం నిలువెత్తు నిదర్శనమని ప్రశంసించింది.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు చోటు లభించడం, సీఎం చేతుల మీదుగా రికార్డు ప్రతిని అందుకోవడం తనపై మరింత బాధ్యత పెంచిందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. లిమ్కా బుక్‌లో చోటు దక్కడానికి ప్రధాన కారణం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అని తెలిపారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో జోగు రామన్న తన పుట్టిన రోజున గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలనే సంకల్పం తీసుకుని ఒక గంటలోనే 3.5 లక్షల మొక్కలు నాటించారని చెప్పారు. రామన్నకు, ఆయన బృందానికి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications