Sun Stroke: వడ దెబ్బతో పెళ్లి కొడుకు మృతి.. ఆగిన పెళ్లి..
దేశాన్ని నైరుతి రుతుపవనాలు తాకినా ఎండల తీవ్రత తగ్గడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండల తీవ్ర ఎక్కువగా ఉంటుంది. ఏపీ, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని కోరుతున్నారు.
బయటకు వస్తే వడ దెబ్బ తగిలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తాజాగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో యువకుడు వడ దెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుడ్లబొరీ గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య, యశోద దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారి పెద్ద కొడుకు తిరుపతికి ఇటివలే పెళ్లి నిశ్చమయమైంది.

మంచిర్యాల జిల్లా భీమినికి చెందిన యువతితో అతని పెళ్లి కుదిరింది. జూన్ 14 బుధవారం మధ్యాహ్నం వారి పెళ్లికి ముహుర్తం నిర్ణయించారు. తిరుపతి పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యాడు. పెళ్లి పత్రికలు కూడా తిరుపతే పంపిణీ చేశాడు. తిరుపతి సోమవారం వడ దెబ్బకు గురయ్యాడు. అతను వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతుండడంతో కుటుంబ సభ్యులు కాగజ్ నగర్ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.
మంగళవారం సాయంత్ర తిరుపతి ఆరోగ్యం విషమించడంతో అతన్ని మంచిర్యాలకు తరలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తిరుపతి మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఇటు అమ్మాయి ఇంటి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. వరుడు మృతి చెందడాని తెలియడంతో వారు షాక్ కు గురయ్యారు.












Click it and Unblock the Notifications