రిజల్ట్స్ టైం.. ఎదురు చూస్తున్న గ్రూప్-1 అభ్యర్థులు.. ఏ టైంకి అంటే ?
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈరోజు ఫలితాలను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకూ గ్రూప్-1 మెయిన్ పరీక్షలు జరిగాయి. మొత్తం 563 పోస్టులకు గానూ, 31,403 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది.
ఫలితాల వెల్లడిలో భాగంగా తొలుత ప్రధాన పరీక్షల మార్కుల ప్రకటనతో గ్రూప్-1 తుది నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తరువాత అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్ ఆప్షన్లు స్వీకరించి, ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం 1:2 నిష్పత్తిలో జాబితా వెల్లడించనుంది. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు. అలానే మంగళవారం నాడు గ్రూప్-2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్, 14న గ్రూప్-3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించనుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తరువాత మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు ఇవే కావడం విశేషం. గ్రూప్-1 ఫలితాల విడుదలలో సమస్యలు ఎదురవ్వగా.. నెల క్రితం దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు మార్గం సుగుమమైంది.












Click it and Unblock the Notifications