తనిఖీకి కోసం వెళ్ళిన జీఎస్టీ అధికారులు కిడ్నాప్: గంటల్లోనే నిందితుల అరెస్ట్, వారు సేఫ్
హైదరాబాద్: నగరంలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కలకలం రేపింది. ఓ షాపు తనిఖీకి వెళ్లిన సెంట్రల్ జీఎస్టీ(GST) అధికారులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
హైదరాబాద్ నగరంలోని శ్రీకృష్ణానగర్‌లో నకిలీ నెంబర్ పెట్టి.. ట్యాక్స్ కట్టని ఒక స్క్రాప్ గోదాంను సీజ్ చేసేందుకు జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ మణిశర్మ, ఆనంద్ వెళ్లారు. అయితే, నిర్వాహకుడు, మరో ముగ్గురు కలిసి ఫార్చూనర్ కారులో వీరిని కిడ్నాప్ చేసి దాడి చేశారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు బాధితుల సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితుల వాహనాన్ని గుర్తించి నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు ఖయ్యూం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించి ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ మాట్లాడుతూ.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని.. జీఎస్టీ అధికారులను కాపాడినట్లు వెల్లడించారు. తనిఖీల కోసం వెళ్లిన జీఎస్టీ అధికారుల ఐడీ కార్డులను లాక్కున్న స్క్రాప్ గోడౌన్ నిర్వాహకులు.. వారిని కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అధికారులపై దాడి చేసి రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు.
మణిశర్మ వెంటనే రూ. 5 లక్షల గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వాహనాల తనిఖీ చేపట్టారు. ఘటనా స్థలానికి 4 కి.మీ లోపలే కిడ్నాపర్ల వాహనట్లు గుర్తించినట్లు తెలిపారు. రాజీవ్ చౌక్ వద్ద నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని.. సీజీఎస్టీ ఇన్ స్పెక్టర్లు మణిశర్మ, ఆనంద్ లను రక్షించినట్లు డీసీపీ తెలిపారు. ఖయ్యూం అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని.. నిందితులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications