వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్ధరాత్రి చారిత్రాత్మక ఘట్టం: జిఎస్టీకి ముందు, తర్వాత ధరలు ఇలా..

దేశంలో పన్ను సంస్కరణల్లో అత్యంత కీలకమైనదిగా నిలిచే జిఎస్టీని స్వాగతించడానికి కేంద్రం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌ వేదికగా శుక్రవారం అర్థరాత్రి జరగబోయే వేడుకల్లో రాష్ట్రపతి,

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: దేశంలో పన్ను సంస్కరణల్లో అత్యంత కీలకమైనదిగా నిలిచే జిఎస్టీని స్వాగతించడానికి కేంద్రం అట్టహాసంగా ఏర్పాట్లు చేసింది. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌ వేదికగా శుక్రవారం అర్థరాత్రి జరగబోయే వేడుకల్లో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు అనేకమంది ప్రముఖులు పాల్గొంటున్నారు.

<strong>జిఎస్టీ: మొబైల్ బిల్లులు ఎంత పెరుగుతాయంటే.., సెల్ ఫోన్‌ రేట్లపై డైలమా?</strong>జిఎస్టీ: మొబైల్ బిల్లులు ఎంత పెరుగుతాయంటే.., సెల్ ఫోన్‌ రేట్లపై డైలమా?

మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భంగా 1947 ఆగస్టు 14వ తేదీ అర్థరాత్రి పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో ప్రత్యేక భేటీ నిర్వహించారు.

ఆ తర్వాత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997లో ఇలాంటి వేడుకను సెంట్రల్‌ హాల్లోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశం పేరుతో అర్థరాత్రి పూట నిర్వహించారు.

ఇప్పుడూ అలాంటి చరిత్రాత్మక ఘట్టాన్ని జిఎస్టీ రూపంలో ఆవిష్కరిస్తున్న సందర్భంగా మళ్లీ అక్కడే భారీ ఏర్పాట్లు చేశారు. జిఎస్టీ వల్ల దేని రేట్లు పెరుగుతాయి, ఏ రేట్లు తగ్గుతాయనే ఆందోళన అందరిలోను ఉంది.

జిఎస్టీకి ముందు వాటి ధరలు ఎలా ఉండేవి, జిఎస్టి తర్వాత ఎలా ఉంటాయో ఇక్కడ చూడొచ్చు. జిఎస్టీ తర్వాత అంటే శుక్రవారం అర్ధరాత్రి నుంచే. జూలై 1న (రేపు) నుంచి మారిన ధరలు అందుబాటులోకి వస్తాయి.

తినే పదార్థాలు

తినే పదార్థాలు

చాక్లెట్లు, బిస్కట్లు: ఇప్పుడు 29%, జీఎస్టీ తర్వాత 18%
కేక్‌లు, ఐస్ క్రీంలు: ఇప్పుడు 29%, జీఎస్టీ తర్వాత 18%
నెయ్యి: ఇప్పుడు 5%, జీఎస్టీ తర్వాత 12%
వెన్న: ఇప్పుడు 14.5%, జీఎస్టీ తర్వాత 12%
చక్కెర: ఇప్పుడు 10%, జీఎస్టీ వచ్చిన 5%
టీ పౌడర్: ఇప్పుడు 10%, జీఎస్టీ తర్వాత 5%
కాఫీ పొడి: ఇప్పుడు 29%, జీఎస్టీ తర్వాత 5%

సబ్బులు, వాషింగ్ మెషిన్ తదితరాలు..

సబ్బులు, వాషింగ్ మెషిన్ తదితరాలు..

సిమెంట్‌: ఇప్పుడు 29%, జీఎస్టీ వచ్చిన 28%
మొబైల్స్‌: ఇప్పుడు 6%, జీఎస్టీ తర్వాత 12%
టీవీలు: ఇప్పుడు 26%, జీఎస్టీ తర్వాత 28%
వైద్య పరికరాలు: ఇప్పుడు 18%, జీఎస్టీ తర్వాత 12%
మైక్రోవేవ్‌ ఓవెన్‌: ఇప్పుడు 26%, జీఎస్టీ తర్వాత 28%
ఫ్రిడ్జిలు: ఇప్పుడు 26%, జీఎస్టీ తర్వాత 28 %
వాషింగ్‌ మెషిన్‌లు: ఇప్పుడు 26%, జీఎస్టీ తర్వాత 28%
సబ్బులు, టూత్ పేస్టులు: ఇప్పుడు 29 %, జీఎస్టీ తర్వాత 18%
కొబ్బరి నూనే: ఇప్పుడు 29 %, జీఎస్టీ తర్వాత 18%

బంగారం, కంప్యూటర్లు...

బంగారం, కంప్యూటర్లు...

ఆయుర్వేదిక్ మందులు: ఇప్పుడు 10%, జీఎస్టీ తర్వాత 12%
బంగారం: ఇప్పుడు 5%, జీఎస్టీ తర్వాత 3%
ఫర్నీచర్: ఇప్పుడు 29%, జీఎస్టీ తర్వాత 12%
కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు: ఇప్పుడు 6%, జీఎస్టీ తర్వాత 18%
బైక్‌లు, కమర్షియల్ వాహనాలు: ఇప్పుడు 30%, జీఎస్టీ తర్వాత 28%
చిన్న కార్లు: ఇప్పుడు 30%, జీఎస్టీ తర్వాత 29%
మీడియం కార్లు: ఇప్పుడు 47%, జీఎస్టీ తర్వాత 43%
పెద్ద కార్లు: ఇప్పుడు 49%, జీఎస్టీ తర్వాత 43%
ఎస్‌యూవీ కార్లు: ఇప్పుడు 55%, జీఎస్టీ తర్వాత 43%

దుస్తులు..

దుస్తులు..

రెడీమేడ్‌ దుస్తులు: (రూ.1000 కంటే తక్కువ) ఇఫ్పుడు 5%, జీఎస్టీ వచ్చిన 2.5%
రెడీమేడ్‌ దుస్తులు: (రూ.1000 కంటే ఎక్కువ) ఇప్పుడు 12%, జీఎస్టీ వచ్చిన 4.5%
చెప్పులు, బూట్లు: (రూ.500 వరకు) ప్రస్తుతం 5%, జీఎస్టీ తర్వాత 5%
చెప్పులు, బూట్లు : (రూ.500 నుంచి రూ.1000 వరకు) ప్రస్తుతం 20.5%, జీఎస్టీ తర్వాత 18%
చెప్పులు, బూట్లు : (రూ.1000పైన)- ప్రస్తుతం 26.5%, జీఎస్టీ వచ్చిన 18%

English summary
In the making since 2000, the Goods and Services Tax (GST) will finally kick in from July 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X